భారత క్రికెట్ లో రిషబ్ పంత్ ది డిఫరెంట్ స్టైల్ బ్యాటింగ్... ఎలాంటి పరిస్థితుల్లోనైనా దూకుడుగా ఆడుతూ అది కూడా ఫీల్డర్లను కన్ఫ్యూజ్ చేస్తూ కొన్ని షాట్లు ఆడుతుంటాడు. బౌలర్లపై ఆధిపత్యం కనబరుస్తూ షాట్లు కొడుతుంటాడు. ఒక్కోసారి ఈ షాట్లతోనే వికెట్ ఇచ్చుకున్నా కూడా పంత్ తన బ్యాటింగ్ స్టైల్ ను మాత్రం వదలిపెట్టడం లేదు. తాజాగా సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్ పంత్ తన న్యాచురల్ బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. టీ ట్వంటీ తరహా షాట్లతో కంగారూలకు చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తొలి బంతి నుంచే విరుచుకుపడ్డాడు. విరాట్ కోహ్లీ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్.. తొలి బంతినే మిడాన్ దిశగా సిక్సర్ తరలించాడు. 14వ ఓవర్ తొలి బంతికి విరాట్ కోహ్లీని ఔట్ చేసిన స్కాట్ బోలాండ్.. రెండో బంతిని లెంగ్త్‌లో వేసాడు. పంత్ ఏ మాత్రం ఆలోచించకుండా మిడాన్ మీదుగా సిక్సర్ కొట్టాడు. ఈ షాట్‌కు బోలాండ్‌తో పాటు ఆసీస్ ఆటగాళ్లు, కామెంటేటర్లు అవాక్కయ్యారు. అద్భుతం.. వాటే ప్లేయర్ అంటూ కామెంటేటర్లు పంత్‌ను ప్రశంసించారు. ప్రస్తుతం ఈ షాట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. విరాట్ కోహ్లీ ఔటయ్యాడనే భయం లేకుండా పంత్ దూకుడుగా ఆడటం చూసి అవాక్కవుతున్నారు. వెబ్‌స్టర్ వేసిన 18వ ఓవర్‌లో హ్యాట్రిక్ బౌండరీలు సాధించిన పంత్.. అతని మరుసటి ఓవర్‌లో ఓ భారీ సిక్సర్‌తో పాటు బౌండరీ బాదాడు. ఇక మిచెల్ స్టార్క్ వేసిన 22వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన పంత్ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 98 బంతులాడి 40 పరుగులే చేసిన పంత్.. తాజా ఇన్నింగ్స్‌లో మాత్రం మరో లెవెల్‌లో బ్యాటింగ్ చేశాడు. పంత్ బ్యాటింగ్ చూస్తుంటే.. తనదైన శైలిలో ఆడుతానంటూ కోచ్ గంభీర్ నుంచి పర్మీషన్ తెచ్చుకున్నట్టే కనిపిస్తోంది. ఓవరాల్ గా రెండో ఇన్నింగ్స్ లో పంత్ 61 పరుగులకు ఔటయ్యాడు. నిజానికి ఈ సిరీస్ లో పంత్ పెద్దగా రాణించలేదు. సిడ్నీలోనే బ్యాట్ తో రాణించాడు. పంత్ కాసేపు క్రీజులో ఉండి సెంచరీ చేసి ఉంటే ఆసీస్ ముందు భారీ టార్గెట్ ఉంచగలిగేవారిమంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.[embed]https://www.youtube.com/watch?v=1_MwvGbvrGg[/embed]