Barrelakka : బర్రెలక్క పోటీ ఓ స్పూర్తి.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
తెలంగాణలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచీ ఓ నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షించింది. రాజకీయాల్లో ఆరితేరిన నేతలు ఉన్న ఆ నియోజవర్గం నుంచి..ఓ సామాన్యురాలు నామినేషన్ వేయడం సంలనంగా మారింది.

In the Telangana elections, Barrelakka's contest is an inspiration.. How many votes have been received..
తెలంగాణలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచీ ఓ నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షించింది. రాజకీయాల్లో ఆరితేరిన నేతలు ఉన్న ఆ నియోజవర్గం నుంచి..ఓ సామాన్యురాలు నామినేషన్ వేయడం సంలనంగా మారింది. అదే కొల్లాపూర్ నియోజకవర్గం. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఫేమస్ అయిన బర్రెలక్క అలియాస్ శిరీష.. కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసింది. యువతకు ఉద్యోగాలు కావాలి.. ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ రావాలనే నినాదంతో ప్రజల్లోకి వచ్చింది శిరీష. తనను గెలిపిస్తే నిరుద్యోగులకు న్యాయం చేస్తాననే ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లింది. సీనియర్ రాజకీయ నేతలకు వ్యతిరేకంగా శిరీష నామినేషన్ వెయ్యడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రచారం సమయంలో శిరీషకు వచ్చిన మద్దతుకు రెండు ప్రధాన పార్టీల నేతలు టెన్షన్ పడ్డారు. ఆ స్థాయిలో బర్రెలక్క చర్చనీయాంశంగా మారింది. కానీ ఎవరూ ఊహించని విధంగా.. ఎన్నికల్లో శిరీషకు డిపాజిట్ కూడా దక్కలేదు. వెయ్యి ఓట్లకే శిరీష పరిమితమైంది. ఓడిపోయినా కూడా శిరీష చేసిన ప్రయత్నం ఎంతో మందిలో స్పూర్తిని నింపింది.
రాజకీయం అంటే కోటానుకోట్ల డబ్బు, పలుకుబడి ఉంటేనే సాధ్యం అవుతుంది అనుకునే ఈ రోజుల్లో.. సొంత ఇల్లు కూడా లేని శిరీష స్థానిక నేతలను టెన్షన్ పెట్టింది. యువత తలుచుకుంటే సమాజంలో మార్పు తథ్యం అని మరోసారి రుజువు చేసింది. యువత రాజకీయాల్లోకి వస్తేనే మార్పు సాధ్యమవుతుందిన శిరీష మరోసారి గుర్తు చేసింది. శిరీష గెలవదు అనేది చాలా మందికి తెలిసిన విషయమే. కానీ ప్రతీ ఒక్కరు ఆమెను సపోర్ట్ చేశారు. దానికి కారణం శిరీషను చూసి మిగతా యువత స్పూర్తి పొందాలని. ఓట్లు గెలిచి ఎమ్మెల్యే కాకపోయినా.. ప్రజల హృదయాలను గెలుచుకుంది శిరీష.