Prabhas And Jr. NTR: వీళ్ల జుట్టు.. వాళ్ల చేతిలో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేయాలన్నా గురూజీ సలహాలు తీసుకోవాల్సిందే. మాటల మాంత్రికుడు ఏం మంత్రవేశాడో కాని పవన్ మాత్రంత్రివిక్రమ్ గైడ్ లైన్స్ లో వెలతాడనేది అందరికీ తెలిసిన సత్యమే.. ఇలా ప్రభాస్ కో గురువున్నాడు. ఎన్టీఆర్ కో గురువున్నాడు. బన్నీ కి లెక్కల గురువు లానే, బాలయ్యకు మాస్ గురువున్నాడు. మహేశ్ బాబుకే గురువు లేకుండాపోయాడు.. ఇంతకి ఎవరు ఎందుకు ఎలా గురువయ్యారు. ఇప్పుడేం సలహాలిస్తున్నారు..? టేకేలుక్

In Tollywood, each director has a mentor, Prabhas, Jr. NTR's mentor is Rajamouli.
పవన్ కళ్యాణ్ గురువు త్రివిక్రమ్.. ఈమాట పవర్ స్టారే ఎన్నో సార్లు అన్నాడు. అది నిజం.. వాళ్ల మధ్య హీరో, దర్శకుడి బంధం కంటే,గురు శిష్యుల సంబంధమే ఎక్కువ. సినిమా కథలు ఓకే చేయటం నుంచి ఆధ్యాత్మిక చింతన వరకు చాలా విషయాల్లో పవన్ ఎక్కువగా త్రివిక్రమ్ మార్గదర్శకత్వంలో పనిచేస్తాడు.
ఇలాంటి గురువే బన్నీకి ఉన్నాడు. తనే లెక్కల మాస్టారు సుకుమార్. ఆర్యతో బన్నీని స్టార్ గా మార్చినా సుకుమారే పుష్ తో స్టైలిష్ స్టార్ ని ఐకాన్ స్టార్ గా మార్చాడు.తన ప్రతీ ఎదుగుదలలో సుకుమారే ఉన్నాడు. అందుకే కొన్ని సార్లు బన్నీ క్రిటికల్ డెసిషన్ తీసుకోవాలంటే ఈ లెక్కల మాస్టార్ నే సంప్రదిస్తాడు. ఇంకొన్ని సార్లు పుష్ప లాంటి రిజెక్టెడ్ స్టోరీని ఓకే చేసి బన్నీ కూడా గురు దక్షిణ సమర్పిస్తాడు.
యంగ్ టైగర్ విషయంలో రాజమౌళి తన గురువు. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, త్రిబుల్ ఆర్ ఇలా నాలుగు సార్లు తారక్ తో సినిమా తీసిన రాజమౌళి నిజానికి కెరీర్ బిగినింగ్ నుంచి ఎన్టీఆర్ కి విశ్వసనీయమైన గురువు. ప్రభాస్ కి కూడా రాజమౌళి గురువు స్థానంలోనే ఉన్నాడు. మహేశ్ బాబుకి శ్రీనువైట్ల గురువు అనేలోపు ఆగడుతో పంచ్ పడింది. బ్రహ్మోత్సవం ఫ్లాప్ తో శ్రీకాంత్ అడ్డాల కూడా మహేశ్ కి గురువయ్యే అవకాశం కోల్పోయాడన్నారు. ఎందుకంటే మహేశ్ కి మంచి హిట్స్ ఇచ్చి సింగిల్ లైన్ చెప్పి ఆగడు ఆఫర్ ని శ్రీనువైట్ల, బ్రహ్మోత్సవం ఆఫర్ ని శ్రీకాంత్ అడ్డాల పట్టారు. అంతనమ్మకం సంపాదించుకున్న వీళ్లు అదే నమ్మకాన్ని ఫ్లాప్ తర్వాత కోల్పోయారు.. అలాచూస్తే మహేశ్ కి ఇండస్ట్రీలో ఏదర్శకుడు గురువనలేం. బాలయ్యకు గురువనేంత లేకున్నా, బోయపాటి ఆ స్తానాన్ని నమ్మిన బంటు రూపంలో రిప్లేస్ చేస్తున్నాడు.