Uttar Pradesh: ఏడు నెలల పసికందు కడుపులో ఆరు నెలల పిండం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ జిల్లాలో ఓ అరుదైన ఆపరేషన్ చేశారు డాక్టర్లు. 7 నెలల వయసున్న ఓ పసికందు కడుపులో నుంచి 6 నెలల వయసు ఉన్న రెండు కిలోల పిండాన్ని బయటకు తీశారు.

In Uttar Pradesh's Prayag district, doctors operated on a baby suffering from a fetus-in-fetus
అవును.. మీరు విన్నది నిజమే. పుట్టినప్పటి నుంచే ఆ చిన్నారి కడుపులో పిండం పెరుగుతోంది. కొన్ని రోజుల నుంచి ఆ చిన్నారికి అనారోగ్యంగా ఉండటం, కడుపు రోజు రోజుకూ పెరుగుతుండటంతో అతని తల్లిదండ్రులు హాస్పిటల్‌కు తరలించారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసిన డాక్టర్లు చిన్నారి కడుపులో పిండం ఉన్నట్టు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి కడుపులో నుంచి పిండాన్ని బయటకు తీశారు. పిండం రెండు కిలోల బరువు ఉందని, కడుపులోనే పిండానికి కాళ్లు, చేతులు, వెంట్రుకలు కూడా వచ్చినట్టు గుర్తించారు.
ఫీటస్-ఇన్-ఫీటస్ అనే ఈ అరుదైన పరిస్థితి చాలా తక్కువ మందిలో ఏర్పడుతుంది. మహిళ గర్భంలో కవళ పిల్లలు ఉన్నప్పుడు ఒక పిండంలో మరో పిండం కలిసిపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని డాక్టర్లు చెప్తున్నారు. 10 లక్షల మందిలో కేవలం ఒక్కరికి మాత్రమే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్తున్నారు. ఇప్పడు చిన్నారి కడుపులో ఉన్న పిండం కూడా కవళ పిల్లలుగా పుట్టాల్సిన పిండం చిన్నారిలో కలిసిపోవడంతో అతని కడుపులో పెరుతూ వచ్చిందని చెప్తున్నారు. ఈ ఆపరేష్ చాలా క్లిష్టంగా ఉంటుందని చెప్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇద్దరి ప్రణాలు పోయే ప్రమాదముందని చెప్తారు. చాలా జాగ్రత్తగా నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చిన్నారి కడుపు నుంచి పిండాన్ని తొలగించారు.