Income tax : ఇలా చేస్తే రూపాయి కూడా ఇన్‌కం ట్యాక్స్ కట్టనవసరంలేదు
ప్రతీ ఒక్క మధ్యతరగతి కుటుంబాన్ని అన్నిటికంటే ఎక్కువగా బాధించేది ఇన్‌కం ట్యాక్స్. వినేందుకు కాస్త అన్ పార్లమెంటరీగా ఉన్నా.. రియాలిటీలో మాత్రం ఇదే నిజం.
ప్రతీ ఒక్క మధ్యతరగతి కుటుంబాన్ని అన్నిటికంటే ఎక్కువగా బాధించేది ఇన్‌కం ట్యాక్స్. వినేందుకు కాస్త అన్ పార్లమెంటరీగా ఉన్నా.. రియాలిటీలో మాత్రం ఇదే నిజం. సంపాదించే దాంట్లీ దాదాపు 20-30 శాతం ట్యాక్స్‌కే వెళ్లిపోవడం అంటే చాలా మందికి ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఈ కొన్ని ట్రిక్స్ పాటిస్తే మీరు ఒక్క రూపాయి కూడా ఇన్‌కం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ వార్షిక ఆదాయం 10 లక్షలు ఉంటే.. పాత ట్యాక్స్ విధానంతో ట్యాక్స్ రిటర్న్స్ పొందవచ్చు. పాత పన్ను పద్ధతిలో ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ కింద 50 వేలు మినహాయింపునిచ్చింది. అంటే మీ ఆదాయం 10 లక్షల ఉంటే అందులో నుంచి 50 వేలు స్టాండర్డ్ డిడక్షన్ తీసివేస్తే మీ ఓవరాల్ ఇన్‌కం 9 లక్షల 50 వేలు అవుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మీరు 1 లక్షా 50 వేలు పెట్టుబడి రూపంలో పొదుపు చేస్తే మీకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
కాకపోతే ఆ పెట్టుబడి ఈపీఎఫ్, పీపీఎఫ్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, ఐదేళ్ళ ఫిక్సడ్ డిపాజిట్స్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు మీరు పన్ను మినహాయింపు పొందుతారు. ఇలా మీ ఇన్‌కం నుంచి లక్షా 50 వేలు తీసేస్తే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 8 లక్షలు అవుతుంది. మీకు ఇంటి లోన్ ఉంటే, దానిపై కట్టే వడ్డీపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24B ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీపై 2 లక్షల రూపాయల దాకా పన్ను మినహాయింపు పొందవచ్చు. ఒకవేళ మీకు ఈ అవకాశం ఉంటే ఆ మొత్తాన్ని మీరు పన్ను కట్టాల్సిన మొత్తం నుంచి మినహాయించండి. అప్పుడు పన్ను పరిధిలోకి వచ్చే మీ ఆదాయం 6 లక్షల రూపాయలు అవుతుంది. ఆదాయపుపన్ను చట్టం సెక్షన్ 80D కింద ఆరోగ్య బీమాపై 25 వేల దాకా పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే ఈ బీమా మీతోపాటు మీ భార్య, పిల్లల పేర్లు ఉండాలి.
దీంతోపాటు మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్ కేటగిరీ కిందకు వస్తే వారి పేరుతో ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు చేస్తే మరో 50 వేలు మినహాయింపు లభిస్తుంది. అంటే ఆరోగ్య బీమా పాలసీల ద్వారా 75 వేల దాకా పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈ మినహాయింపులు పోయాక ఇప్పుడు పన్ను పరిధిలోకి వచ్చే మీ ఆదాయం మొత్తం 5 లక్షల 25 వేలు అవుతుంది. మీరు ప్రత్యేకంగా ప్రతీ ఏటా నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో 50 వేలు పొదుపుచేస్తే మీకు అదనంగా సెక్షన్ 80CCD (1B) కింద 50వేలు మినహాయింపు వస్తుంది. దీన్ని కూడా పన్ను పరిధిలోని మీ ఆదాయం నుంచి మినహాయిస్తే పన్ను కట్టాల్సిన ఆదాయం 4 లక్షల 75 వేల రూపాయలు అవుతుంది. 5 లక్షల ఆదాయంపై 12 వేల 500 పన్ను మినహాయింపు ఉంది. అటువంటి పరిస్థితిలో, మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఇప్పుడు కేవలం 4 లక్షల 75 వేలు. ఈ మొత్తానికి ట్యాక్స్ ఉండదు కాబట్టి. మీరు ఇన్‌కం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. దీంతో మీపై ఎలాంటి పన్ను భారం పడదు.