Union Budget : కేంద్ర బడ్జెట్‌పై పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి నేతల నిరసన
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు కూటమి పార్టీలకు చెందిన ఎంపీలంతా పార్లమెంట్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మేరకు నేతలంతా ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై ఇండియా కూటమి నేతలు నేడు ఢిల్లీలో నిరసన కార్యక్రమంల చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ఈ బడ్జెట్ బీజేపీ మిత్రపక్షాలను సంతృప్తి పరచడానికి ప్రవేశపెట్టారు. ఇతరులకు ఏం ఇవ్వలేదు’’ అని మండిపడ్డారు.
ఉభయసభల్లో విపక్షాల ఆందోళన
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వరుసగా మూడో రోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే నిన్న ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌పై చర్చ ప్రారంభం అయ్యింది. అయితే దీనిని వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. బడ్జెట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే ఉభయ సభలు కొనసాగుతున్నాయి. NDA ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఇది అని ఆరోపిస్తు.. రాజ్యసభ నుంచి విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు.