టీమిండియా బ్యాటర్ల వైఫల్యంపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. గంభీర్ ప్రధాన కోచ్ గా వచ్చినప్పటి నుంచి మన బ్యాటింగ్ ఘోరంగా విఫలమవుతోంది. బౌలింగ్ లో రాణిస్తున్నా బ్యాటింగ్ లో చేతులెత్తేస్తున్నారు. దీంతో బీసీసీఐ కొత్త బ్యాటింగ్ కోచ్ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రేస్ లో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అందరి కంటే ముందున్నాడు. భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా తనకు ఆసక్తి ఉందని వెల్లడించాడు. టీమిండియా బ్యాటింగ్ కోచ్ కు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ఇంగ్లండ్ క్రికెట్ లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా పీటర్సన్ పేరు తెచ్చుకున్నాడు 104 టెస్టుల్లో 47.28 సగటుతో 8181 పరుగులు చేశాడు. వీటిలో 23 సెంచరీలు ఉన్నాయి. వచ్చే డబ్ల్యూటీసీ సీజన్ ను భారత్ ఇంగ్లాండ్ టూర్ ద్వారానే మొదలుపెట్టనుంది. దీంతో పీటర్సన్ కోచింగ్ కలిసొస్తుందని భావిస్తున్నారు.[embed]https://www.youtube.com/watch?v=PsuiFMd4A-s[/embed]