Matsya 6000 Mission: మత్స్య 6000 పేరుతో సముద్రాన్వేషణ చేసేందుకు సిద్దమవుతున్న సముద్రయాన్
సముద్రంలోని జీవజాలాన్ని పరిశోధనలు జరిపేందుకు సరికొత్త మిషన్ ను సముద్రగర్భంలోకి ప్రవేశపెట్టబోతున్నారు. దీని గురించి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో భారత్ చాలా ఉత్సాహంతో అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే మిషన్ ఆదిత్య ఎల్ 1 ను సూర్యుని కక్ష లోకి పంపించింది. అయితే తాజాగా సముద్రంలో ప్రయోగాలు చేసి అక్కడి పూర్తి స్థాయి పరిస్థితులను కనుగొనేందుకు సముద్రయాన్ ను పంపించేందుకు సిద్దమవుతోంది. ఈ ప్రాజెక్టుకు జలాంతర్గామి మత్య-6000 అని పేరు పెట్టింది.
మత్స్య -6000 అంటే ఏంటి..
సముద్ర గర్భంలో ఉండే మొత్తం ప్రదేశాలను, అక్కడి వాతావరణాన్ని, ప్రస్తుత పరిస్థితుల్ని అంచనా వేసేందుకు ఉపయోగపడే ఒక సాధనం. గతంలో మనుషులు సముద్ర గర్భంలోకి ఆక్సిజన్ సిలిండర్లు ధరించి అక్కడి మొత్తం సమాచారాన్ని పరిశీలించి పరిశోధనలు చేసేవారు. కానీ ఈ మత్స్య 6000 ద్వారా మానవుడి ప్రమేయం లేకుండా సముద్ర గర్భాన్వేషణ జరుపుతుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేశారు. దీనిని చెన్నైకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ది చేసినట్లు తెలిపారు. మొట్టమొదటి మానవ ప్రమేయంలేని సముద్రాన్వేషణ మిషన్ గా గుర్తింపు పొందింది. పర్యావరణానికి ఎలాంటి ముంపు వాటిల్లకుండా ఉండేలా దీనిని తయారు చేసినట్లు పేర్కొన్నారు. 2026 నాటికి దీనిని సముద్రంలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని వెల్లడించారు.
మత్స్య 6000 ప్రత్యేకతలు..
- మానవ ప్రమేయం లేని డీప్ ఓషన్ మిషన్.
- ఇందులో ముగ్గురు కూర్చొని ఆరు కిలోమీటర్ల వరకూ సముద్ర గర్భంలో ప్రయాణం చేయవచ్చు.
- సముద్రంలోని వనరులు, జీవ సంపద, అక్కడి పరిస్థితులను పరిశోధనలు జరుపుతుంది.
- పర్యావరణానికి హాని చేయకుండా మనకు కావల్సిన సమాచారాన్ని ఫోటోల రూపంలో అందిస్తుంది.
ప్రయోజనాలు..
- సముద్ర గర్భంలోని అపారమైన ఖనిజ సంపదను గుర్తిస్తుంది.
- వాటిని ఎలా వినియోగించాలో సూచిస్తుంది.
- తద్వారా దేశ ఆర్థికాభివృద్దికి దోహదపడుతుంది.
- అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పింస్తుంది.
- నీలి సంపదను వృద్ది చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
T.V.SRIKAR