మళ్లీ గుచ్చుకున్న గులాబీ పింక్ బాల్ టెస్టులో భారత్ ఘోర ఓటమి
పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు.ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 180 రన్స్ చేసిన టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో 175 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా ముందు 19 పరుగుల స్వల్ప టార్గెట్‌ను విధించింది.
పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు.ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 180 రన్స్ చేసిన టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో 175 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా ముందు 19 పరుగుల స్వల్ప టార్గెట్‌ను విధించింది. ఈ ఈజీ టార్గెట్‌ను మూడు ఓవర్లలోనే ఆస్ట్రేలియా ఛేదించింది.ఐదు వికెట్ల నష్టానికి 128 పరుగులతో మూడో రోజును మొదలుపెట్టిన టీమిండియా మరో నలభై ఏడు పరుగులు మాత్రమే జోడించి మిగిలిన వికెట్లను కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోరుకు ఒక్క పరుగు కూడా జోడించకుండానే రిషబ్ పంత్ వెనుదిరిగాడు. 31 బాల్స్‌లో ఐదు ఫోర్లతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతోన్న నితీష్ రెడ్డి ధాటిగా ఆడుతూ టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేశాడు .
అతడికి మిగిలిన బ్యాట్స్‌మెన్స్ నుంచి సరైన సహకారం లభించలేదు. టెయిలెండర్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఫోర్లు, సిక్సర్లతో జోరు మీదున్న నితీష్ తొమ్మిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 47 బాల్స్‌లో ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేశాడు. కాగా సీనియర్ బ్యాటర్ల వైఫల్యమే ఈ ఓటమికి కారణంగా చెప్పాలి.ఫస్ట్ ఇన్నింగ్స్‌తో పాటు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సీనియర్ ప్లేయర్లు కోహ్లి, రోహిత్ దారుణంగా నిరాశపరిచారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కమిన్స్ ఐదు వికెట్లు తీసుకోగా…బోలాండ్ మూడు, స్టార్క్‌కు రెండు వికెట్లు దక్కాయి.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 180 పరుగులు చేయగా..ఆస్ట్రేలియా 338 పరుగులు చేసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించింది. రెండో టెస్ట్‌లో విసయంతో 1-1తో సిరీస్‌ను ఆస్ట్రేలియా సమం చేసింది.