India vs England: ముగిసిన రెండో రోజు ఆట.. ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్‌కు 171 పరుగుల ఆధిక్యం
రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభించిన భారత్.. ఆట ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా, 28 పరుగులు చేసింది. దీంతో ఇండియాకు 171 పరుగుల ఆధిక్యం లభించింది. జైశ్వాల్ 15 పరుగులతో, రోహిత్ శర్మ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.
India vs England: విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు, రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 28/0తో బ్యాటింగ్ చేస్తోంది. అంతకుముందు ఇంగ్లండ్ 253 పరుగులకే ఆలౌటైంది. దీంతో 143 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభించిన భారత్.. ఆట ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా, 28 పరుగులు చేసింది. దీంతో ఇండియాకు 171 పరుగుల ఆధిక్యం లభించింది.
KTR: బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయంపై సీఎం ఎందుకు స్పందించరు: కేటీఆర్
జైశ్వాల్ 15 పరుగులతో, రోహిత్ శర్మ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో జాక్ క్రాలే 76 పరుగులతో, బెన్ స్టోక్స్ 47 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. 55.5 ఓవర్లలోనే ఇంగ్లండ్ జట్టును భారత బౌలర్లు కూల్చేశారు. భారత బౌలింగ్‌కు సంబంధించి బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆరు వికెట్లు తీసి, ఇంగ్లండ్ వెన్ను విరిచాడు. స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు. రెండో రోజు 336/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ఆరంభించిన భారత జట్టు మరో 60 పరుగులు మాత్రమే చేసి, మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. మొత్తంగా మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైశ్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్సర్లతో డబుల్ సెంచరీ సాధించాడు. 191 పరుగుల వద్ద ఒక సిక్సర్, ఒక ఫోర్‌తో డబుల్ సెంచరీ సాధించడం విశేషం.
సాధారణంగా డబుల్ సెంచరీకి చేరువైతే.. ఎక్కువ బంతులు ఆడుతూ, నెమ్మదిగా డబుల్ సెంచరీ సాధిస్తారు. కానీ, జైశ్వాల్ మాత్రం ఆత్మ విశ్వాసంతో, దూకుడుగా ఆడుతూ ద్విశతకం పూర్తి చేసుకోవడం విశేషం. బౌండరీల వద్ద ఫీల్డర్లున్నా చెలరేగాడు. మొత్తంగా 290 బంతుల్లో 209 పరుగులు చేసి ఔటయ్యాడు. టెస్టుల్లో ఇది అతడికి తొలి డబుల్ సెంచరీ. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్, షోయబ్ బషీర్, రేహాన్ అహ్మద్ చెరో మూడు వికెట్లు తీశారు.