కివీస్ చేతిలో భారత్ వైట్ వాష్ పాక్ మాజీల ఓవరాక్షన్

న్యూజిలాండ్ చేతిలో భారత్ జట్టు 0-3తో టెస్ట్ సిరీస్ ను ఓడిపోవడం ప్రపంచ క్రికెట్ నే ఆశ్చర్యపరిచింది. టెస్ట్ క్రికెట్ లో అత్యుత్తమ ప్రదర్శనతో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న టీమిండియా ఇలాంటి ఓటమి చవిచూస్తుందని ఎవ్వరూ అనుకోలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 5, 2024 | 11:31 AMLast Updated on: Nov 05, 2024 | 11:31 AM

India Whitewashed By Kiwis Overaction Of Former Pak

న్యూజిలాండ్ చేతిలో భారత్ జట్టు 0-3తో టెస్ట్ సిరీస్ ను ఓడిపోవడం ప్రపంచ క్రికెట్ నే ఆశ్చర్యపరిచింది. టెస్ట్ క్రికెట్ లో అత్యుత్తమ ప్రదర్శనతో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న టీమిండియా ఇలాంటి ఓటమి చవిచూస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. అది కూడా స్వదేశంలో ఇంత దారుణంగా వైట్ వాష్ పరాభవం ఎదురవుతుందని అస్సలు ఊహించలేదు. ఒకవిధంగా భారత క్రికెట్ ఫ్యాన్స్ కే కాదు వేరే దేశాల ఫ్యాన్స్ కు కూడా ఇది షాకే.. అయితే పాకిస్తాన్ కూడా మాత్రం భారత్ ఓటమి సంతోషాన్నిస్తోంది. ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు భారత క్రికెటర్లపై పడి ఏడ్చే పాక్ మాజీలు ఇప్పుడు ఎగతాళి చేస్తూ శునకానందాన్ని పొందుతున్నారు. టీమిండియాను ఇప్పుడు తాము కూడా ఓడిస్తామంటూ పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ వ్యాఖ్యానించాడు. స్పిన్ పిచ్ లపై భారత్ ను చిత్తు చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు.

పాకిస్తాన్ మాజీ ఓపెనర్ అహ్మద్ షాజాద్ కూడా టీమిండియా ఆటతీరుపై విమర్శలు గుప్పించాడు. మొదటి టెస్టు ఓడిన తర్వాత తప్పులను సరిదిద్దుకుని బరిలో దిగాలని, కానీ టీమిండియా పూర్తిగా నీరుగారిపోయినట్టుగా ఆడిందని చెప్పాడు. రెండో టెస్ట్ గెలిచి సిరీస్ సమం చేయాలన్న కసి భారత క్రికెటర్లలో కనిపించలేదని, టీమిండియా ఆటతీరు చూస్తే స్కూల్ పిల్లలు ఆడుతున్నట్టు అనిపించిందంటూ ఎగతాళి చేశాడుయ పేపర్ పులుల్లా ఆడారు, అందుకే ఓడారు అంటూ ఓ టీవీ షోలో కాస్త అతిగా మాట్లాడాడు. అటు పాక్ పత్రికలు కూడా భారత్ ఓటమిని హైలైట్ చేశాయి.

కాగా పాక్ మాజీలే కాదు ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్ళు కూడా భారత్ జట్టు ఓటమిపై స్పందించారు. టర్నింగ్ పిచ్ లపై ఏ జట్టయినా ఇప్పుడు టీమిండియాను ఓడిస్తుందంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే పాక్ మాజీల కామెంట్స్ పై భారత క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇటీవల బంగ్లాదేశ్ చేతిలో ఓడిన పాక్ జట్టు గురించి మాట్లాడాలంటూ కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు 10 రోజుల విశ్రాంతి అనంతరం భారత జట్టు ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది. ప్రస్తుతం భారత టీ ట్వంటీ టీమ్ సౌతాఫ్రికా టూర్ కు వెళ్ళగా… టెస్ట్ జట్టు క్రికెటర్లు మాత్రం రిలాక్స్ అవుతున్నారు. నవంబర్ 22 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలుకానుంది. ఈ సారి భారత్, ఆస్ట్రేలియా జట్లు ఐదు టెస్టుల సిరీస్ ఆడనుండగా.. తొలి మ్యాచ్ కు పెర్త్ ఆతిథ్యమిస్తోంది. గత రెండు పర్యాయాలూ టీమిండియానే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలవాలంటే భారత్ ఆసీస్ టూర్ లో ఖచ్చితంగా 4 టెస్టులు గెలవాలి. అప్పుడే ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకుంటుంది.