వన్డే వరల్డ్ కప్ కు ప్రాక్టీస్ కివీస్ తో భారత్ వుమెన్ సిరీస్
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ ముంగిట ఓడిన భారత జట్టు త్వరలోనే సొంతగడ్డపై వన్డే సిరీస్ ఆడనుంది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ లో భాగంగా భారత మహిళల జట్టు న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ లో తలపడుతుంది.

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ ముంగిట ఓడిన భారత జట్టు త్వరలోనే సొంతగడ్డపై వన్డే సిరీస్ ఆడనుంది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ లో భాగంగా భారత మహిళల జట్టు న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ లో తలపడుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం ఈ మూడు మ్యాచ్‌లకూ ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 24న మొదటి వన్డే , 27న రెండో వన్డే, 29వ తేదీన మూడో వన్డే జరుగనున్నాయి. ఈ సిరీస్ భారత్ కంటే కూడా కివీస్ కే కీలకంగానే మారింది. వచ్చే ఏడాది మహిళల వన్డే వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించాలంటే న్యూజిలాండ్ జట్టు భారత్ పై గెలవాల్సిందే. ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు వరల్డ్ కప్ బెర్తు సొంతం చేసుకున్నాయి.