ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో భారత బ్యాటర్ రిషబ్ పంత్ పోరాటం ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లు బాడీలైన్ బంతులతో ఇబ్బంది పెట్టినా.. ధైర్యంగా ఎదుర్కొన్నాడు. వారి పేస్ ధాటికి పలుసార్లు రిషబ్ శరీరానికి బంతులు బలంగా తగిలాయి. రెండు సార్లు ఫిజియో కూడా గ్రౌండ్‌లోకి వచ్చి చికిత్స అందించాడు. ఓసారి స్టార్క్ వేసిన బౌన్సర్.. పంత్ భుజం వద్ద తగిలింది. దీంతో అక్కడ ఎర్రగా కందిపోయి మచ్చ పడింది. ఫిజియో వచ్చి ఐస్ ప్యాక్ పెట్టిన తర్వాత మళ్ళీ పంత్ బ్యాటింగ్ కొనసాగించాడు. ఇక బోలాండ్ వేసిన మరో బంతి అతని థై ప్యాడ్స్ పైభాగాన తగిలింది. దీంతో రెండోసారి కూడా ఫిజియో వచ్చి పంత్‌కు చికిత్స అందించాల్సి వచ్చింది. ఇలా దెబ్బలు తింటూనే బ్యాటింగ్ చేసిన పంత్ 40 రన్స్ కు ఔటయ్యాడు.[embed]https://www.youtube.com/watch?v=XzdEvDYwkQc[/embed]