ఏమిరా నీ వల్ల ఉపయోగం, సిరాజ్ పై ఫాన్స్ ట్రోలింగ్
మహ్మద్ సిరాజ్... జాతీయ జట్టులోకి వచ్చిన కొద్ది కాలంలోనే టీమిండియాలో కీలక బౌలర్ గా ఎదిగాడు. సీనియర్ పేసర్లు లేని టైమ్ లో భారత బౌలింగ్ ఎటాక్ ను నడిపించాడు. ముఖ్యంగా ఆసీస్ గడ్డపై భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
మహ్మద్ సిరాజ్… జాతీయ జట్టులోకి వచ్చిన కొద్ది కాలంలోనే టీమిండియాలో కీలక బౌలర్ గా ఎదిగాడు. సీనియర్ పేసర్లు లేని టైమ్ లో భారత బౌలింగ్ ఎటాక్ ను నడిపించాడు. ముఖ్యంగా ఆసీస్ గడ్డపై భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ గత కొంత కాలంగా సిరాజ్ అనుకున్న రీతిలో రాణించలేక పోతున్నాడు. సొంత గడ్డపై కూడా నిరాశ పరిచాడు. తనకు అద్భుతమైన రికార్డున్న ఆసీస్ లోనూ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ప్రస్తుత ఆసీస్ టూర్ లోనూ ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయాడు. నిజానికి ఈ సారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా తప్పిస్తే మిగిలిన బౌలర్ల ప్రదర్శన నిరాశ పరించిందనే చెప్పాలి. సిరాజ్ కూడా విఫలమవుతుండడంతో ఆ భారం అంతా బూమ్రాపై పడి ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మహమ్మద్ సిరాజ్ పై నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కూడా సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు.
తొలి ఇన్నింగ్స్ లో 23 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. పైగా పరుగులు మాత్రం భారీగా సమర్పించుకున్నాడు. 5.30 ఎకానమీతో ఏకంగా 122 పరుగులు ఇచ్చేశాడు. సిరాజ్ టెస్ట్ కెరీర్ లోనే ఇది అత్యంత చెత్త రికార్డు. ఒక ఎండ్‌లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే మరో ఎండ్‌లో సిరాజ్ అతనికి సహకారం అందించలేదు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయకుండా పరుగులివ్వడంతో ఆసీస్ బ్యాటర్లు స్వేచ్చగా బ్యాటింగ్ చేశారు.
ఈ మ్యాచ్‌లోనే కాదు ఈ సిరీస్‌లోనే సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఐదు వికెట్లతో పర్వాలేదనిపించిన సిరాజ్.. రెండో టెస్ట్‌లో నాలుగు వికెట్లు మాత్రమే తీసాడు. మూడో టెస్ట్‌లోనూ నాలుగు వికెట్లే తీసాడు. బుమ్రా ఏడు ఇన్నింగ్స్‌ల్లో 25 వికెట్లు తీస్తే సిరాజ్..14 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అతని బౌలింగ్ వైఫల్యం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీస్తోంది. దీంతో సిరాజ్ పై సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ మండిపడుతున్నారు. హైదరాబాద్ కి వచ్చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డిఎస్పీ ఉద్యోగం చేసుకోవాలని హితవు పలుకుతున్నారు.