Indian Graziers: చైనాకు చుక్కలు చూపించిన భారత గొర్రెల కాపర్లు.. మీ తోక కత్తిరించేందుకు వీళ్లు చాలురా..

వాస్తవాధీన రేఖ దగ్గర గొర్రెలను మేపకుండా అడ్డుకునేందుకు చైనా సైనికులు ప్రయత్నించగా.. మన కాపరులు ఇచ్చిన కౌంటర్‌.. ఇప్పుడు కోట్లమంది మనసులను గెలుచుకుంటోంది. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2024 | 02:31 PMLast Updated on: Jan 31, 2024 | 2:31 PM

Indian Graziers Confront Chinese Soldiers In Eastern Ladakh

Indian Graziers: బోర్డర్‌లో చైనా చేసే అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. పైకి సుద్దపూసలాగా యాక్ట్‌ చేస్తూ.. సుప్పనాతి వేషాలు వేస్తుంటుంది చైనా. ఓ వైపు చర్చలు అంటూనే.. మరోవైపు సరిహద్దుల్లో తోక జాడిస్తుంటారు డ్రాగన్‌గాళ్లు. గాల్వాన్‌ లోయ ఘటన తర్వాత.. ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతలు పీక్స్‌కు చేరాయ్‌. నాలుగేళ్లుగా ఈ ప్రతిష్టంభన ఇలానే కంటిన్యూ అవుతోంది. బోర్డర్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు.. సైనిక అధికారుల స్థాయి చర్చలు, దౌత్యపరమైన సంప్రదింపులు జరిగాయ్.

Kaushik Reddy: జంప్‌ పక్కానా.. కాంగ్రెస్‌లోకి BRS MLA కౌశిక్‌ రెడ్డి..?

ఐనా సరే.. ఇంకా కొన్ని వివాదాస్పద ప్రాంతాల్లో చైనా తోకజాడిస్తూనే ఉంది. దీంతో భారత్ కూడా అప్రమత్తంగా ఉంది. బలగాలను అలాగే మోహరించింది. వాస్తవాధీన రేఖ దగ్గర గొర్రెలను మేపకుండా అడ్డుకునేందుకు చైనా సైనికులు ప్రయత్నించగా.. మన కాపరులు ఇచ్చిన కౌంటర్‌.. ఇప్పుడు కోట్లమంది మనసులను గెలుచుకుంటోంది. వాస్తవాధీన రేఖ దగ్గర గొర్రెలను మేపకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన చైనా సైనికులను లద్దాఖ్‌ గొర్రెల కాపరులంతా కలిసి ధైర్యంగా ఎదుర్కొన్నారు. గాల్వాన్ ఘర్షణ తర్వాత.. స్థానిక గొర్రెల కాపరులు ఈ ఏరియాలో పెంపుడు జంతువులను మేపడం మానేశారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలతో వాదిస్తూ, తాము భారత భూభాగంలో ఉన్నామని చెప్తున్న వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. LAC అనేది భారత్, చైనా భూభాగాలను వేరుచేసే సరిహద్దు రేఖ.

ఐతే బోర్డర్ విషయంలో రెండుదేశాల మధ్య భిన్నాప్రాయాలు ఉండడం.. కొన్ని సందర్భాల్లో ఘర్షణలకు దారి తీస్తోంది. చైనా సైనికులుకు ధీటుగా బదులిచ్చిన స్థానిక గొర్రెల కాపర్ల ధైర్యాన్ని, భారత సైన్యం మద్దతును ప్రశంసిస్తూ చూషుల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాంజిన్ ట్విట్టర్‌లో వీడియో షేర్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. రేయ్ చైనాగాళ్లారా.. మిమ్మల్ని ఎదిరించేందుకు సైన్యమే అవసరం లేదురా.. మా సామాన్యులు, గొర్రెల కాపరులు చాలు.. ఇది ఇండియా పవర్ అంటూ.. పోస్టులు పెడుతున్నారు మనోళ్లు.