Indiramma houses : తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకంకు ముహూర్తం ఫిక్స్.. ఈనెల 11నే..!

తెలంగాణ (Telangana) ప్రజలకు రేవంత్ రెడ్డ (CM Revanth Reddy) సర్కర్ మరో శుభ వార్త చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రటించిన ఆరు గ్యారెంటీల (Six Guarantees).. అధికారంలోకి వచ్చాకా.. వాటి అములుపై ప్రత్యేక దృష్టిసాదించారు. ఇప్పటికే మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ. 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం, రూ.500 లకు గ్యాస్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ లాంటి పథకాలను ప్రారంభించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2024 | 07:41 AMLast Updated on: Mar 06, 2024 | 7:41 AM

Indiramma Houses Fixed In Telangana

తెలంగాణ (Telangana) ప్రజలకు రేవంత్ రెడ్డ (CM Revanth Reddy) సర్కర్ మరో శుభ వార్త చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రటించిన ఆరు గ్యారెంటీల (Six Guarantees).. అధికారంలోకి వచ్చాకా.. వాటి అములుపై ప్రత్యేక దృష్టిసాదించారు. ఇప్పటికే మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ. 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం, రూ.500 లకు గ్యాస్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ లాంటి పథకాలను ప్రారంభించింది.

ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు..

తాజాగా.. ఆరు గ్యారెంటీలో ముఖ్యమైన గ్యారెంటీ అయిన.. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రత్యేక దృష్టిసారించింది. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11న ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సమీక్ష నిర్వహించిన మార్చి 11న ప్రభుత్వం ఇందిరమ్మ పథకం ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ మొదట ప్రాధాన్యమివ్వాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయాలన్నారు. అందరికంటే ముందుగా ప్రజా పాలనలో నమోదు చేసుకున్న అర్హులందరికీ వీలైనంత త్వరగా ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

ఇంటి స్థలం ఉంటే : రూ.5 లక్షలు..

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇంటి స్థలం ఉన్నవారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారు. వీటిని దశల వారీగా నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్నారు. ఈ పథకంతో ఎవరైనా తమకు నచ్చినట్లు ఇంటి నిర్మాణం చేసుకోవచ్చా.. వారికి ప్రభుత్వం ఎటువంటి నింబధనలు విధించదిని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇళ్లకు హౌజింగ్‌ బోర్డు రుణాలు కేటాయింపు..

దీనిలో భాగంగా ఇందిరమ్మ పథకం కోసం నిధులను కూడా కేటాయించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధింది హడ్కో మంగళవారం రూ.3 వేల కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 95,235 ఇళ్లు మంజూరు చేసింది.
ఈ ఇళ్ల నిర్మాణం కోసం హౌజింగ్‌ బోర్డు రుణాన్ని వినియోగించనుంది. అంతకుముందు హౌజింగ్‌ బోర్డుకు రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో 57,141, పట్టణాల్లో 38,094 ఇళ్లు నిర్మించనున్నారు