Yuva Bharat : ఎదురులేని యువభారత్.. టీ20 సిరీస్ కైవసం
జింబాబ్వే పర్యటనలో యువ భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయంతో టీ ట్వంటీ సిరీస్ ను కైవసం చేసుకుంది.

Invincible Yuva Bharat.. won the T20 series
జింబాబ్వే పర్యటనలో యువ భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయంతో టీ ట్వంటీ సిరీస్ ను కైవసం చేసుకుంది. హరారే వేదికగా జరిగిన నాలుగో టీ ట్వంటీలో యంగ్ ఇండియా 10 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య జట్టు 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. కెప్టెన్ సికిందర్ రాజా 46 పరుగులతో రాణించాడు. ఛేజింగ్ లో భారత ఓపెనర్లు జైశ్వాల్ , గిల్ జింబాబ్వే బౌలర్లను ఆటాడుకున్నారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. దీంతో పవర్ ప్లేలోనే భారత్ 61 పరుగులు చేసింది. తర్వాత కూడా అదే దూకుడు కొనసాగిస్తూ మ్యాచ్ ను ముగించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. సిరీస్ లో తర్వాతి మ్యాచ్ ఆదివారమే జరుగుతుంది.