Ayodhya Ram Mandir Inauguration : అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి విపక్ష నాయకులకు ఆహ్వానం..
అయోధ్య రామ మందిరం.. ఈ పేరు తెలియని వారు భారతీయుడు ఉండడు. యావత్ ప్రపంచ భారతీయులందరు అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం కోసం వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. అది కూడా ఎప్పుడో కాదు.. మరి కొన్ని రోజుల్లోనే.. జరగబోతుంది.
అయోధ్య రామ మందిరం.. ఈ పేరు తెలియని వారు భారతీయుడు ఉండడు. యావత్ ప్రపంచ భారతీయులందరు అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం కోసం వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. అది కూడా ఎప్పుడో కాదు.. మరి కొన్ని రోజుల్లోనే.. జరగబోతుంది.
అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కీలక విపక్ష నేతలకు కూడా ఆహ్వానం అందింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, జేడీ (ఎస్) అధినేత దేవేగౌడలకు ఆహ్వానాలు పంపినట్లు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది విపక్ష నేతలకు ఆహ్వానాలు అందే అవకాశం ఉందని సమాచారం. అయితే.. ఈ కార్యక్రమానికి విపక్ష నేతలు గౌర్హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం..
ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమాంలో ముఖ్యపాత్ర పోషించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే జోరందుకున్నాయి. కాగా ఆలయా ఏర్పాట్ల పనులను జనవరి 15 నాటికి ఏర్పాట్లన్నీ పూర్తి కానున్నాయి. ప్రాణ ప్రతిష్ట పూజ జనవరి 16న ప్రారంభమై జనవరి 22కు ముగియనుంది.
సీతరాముల వనవాసపు 100 దేవతా విగ్రమాలతో ఊరేరింపు..
రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలో భాగంగా జనవరి 17న 100 దేవతా విగ్రహాలతో శ్రీరాముడి జీవితంలోని దృశ్యాలను ప్రదర్శిస్తూ ఊరేగింపు ఉంటుంది. ఈ ఊరేగింపులో శ్రీరాముడు పుట్టినప్పటి నుంచి వనవాసం వరకు సాగిన జీవితం, లంకపై విజయం, అయోధ్యకు తిరిగి రావడం వంటి చిత్రాలు ఉంటాయని ప్రధాన శిల్పి రంజిత్ మండల్ తెలిపారు.