ఐపీఎల్ మెగా వేలం ఆర్సీబీ గుడ్ బై చెప్పేది వీరికే
ఐపీఎల్ 18వ సీజన్ కు ముందు జరిగే మెగా వేలంపైనే అందరి చూపు ఉంది. ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిటైన్ చేసుకుంటుంది... వేలంలో ఎవరు జాక్ పాట్ కొడతారనే చర్చ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలం వ్యూహాత్మకంగా సిద్ఝమవుతోంది.
ఐపీఎల్ 18వ సీజన్ కు ముందు జరిగే మెగా వేలంపైనే అందరి చూపు ఉంది. ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిటైన్ చేసుకుంటుంది… వేలంలో ఎవరు జాక్ పాట్ కొడతారనే చర్చ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలం వ్యూహాత్మకంగా సిద్ఝమవుతోంది. పలువురు స్టార్ ప్లేయర్స్ కు గుడ్ బై చెప్పబోతోంది. ఈ జాబితాలో కెప్టెన్ డుప్లెసిస్, ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ కూడా ఉన్నారు. కెప్టెన్ గా, వ్యక్తిగత ఆటపరంగానూ డుప్లెసిస్ బాగానే రాణిస్తున్నా వయసు కీలకం కానుంది. 40 దాటిన ఈ సఫారీ క్రికెటర్ ను జట్టులో కొనసాగించే అవకాశాలు కనిపించడం లేదు. డుప్లెసిస్ కెప్టెన్సీలోనే ఆర్సీబీ రెండుసార్లు ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయింది. అయితే జట్టుకు కొత్త సారథిని ఎంపిక చేసుకునేందుకు సిద్ధమైన ఆర్సీబీ డుప్లెసిస్ ను వేలంలోకి వదిలేయనుంది.
అలాగే ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ కు కూడా గుడ్ బై చెప్పబోతోంది. గత సీజన్ లో మాక్స్ వెల్ అత్యంత పేలవప్రదర్శనతో నిరాశపరిచాడు. కేవలం 52 పరుగులకే పరిమితమైన మాక్స్ వెల్ ను బెంగళూరు ఎట్టిపరిస్థితుల్లోనూ రిటైన్ చేసుకునే అవకాశాలు లేవు. వేలంలోకి వదిలేసినా మాక్సీ 5 కోట్ల లోపే ధర పలుకుతాడని అంచనా. ఇక మరో ప్లేయర్ మహిపాల్ లామ్రోర్ ను కూడా ఆర్సీబీ వదిలేయబోతోంది. 2023 సీజన్ లో అంచనాలు పెట్టుకున్న లామ్రోర్ పూర్తిగా నిరాశపరిచాడు. కేవలం 135 పరుగులకే పరిమితయ్యాడు. 2024 సీజన్ లోనూ 10 మ్యాచ్ లు ఆడి 125 పరుగులే చేయగలిగాడు. రైట్ టూ మ్యాచ్ ద్వారా కూడా అతన్ని జట్టులోకి తిరిగి తీసుకునే అవకాశం లేదు.