ఐపీఎల్ మెగా వేలం, ఆ ముగ్గురికీ రూ.15 కోట్లు ఖాయం
ఐపీఎల్ మెగావేలానికి ఈ సారి 1,574 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. దీనిలో 320 మంది క్యాప్డ్ ఆటగాళ్లు కాగా.. 1,224 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. వీరితో పాటు అసోసియేట్ దేశాలకు చెందిన 30 మంది క్రికెటర్లు కూడా ఉన్నారు.
ఐపీఎల్ మెగావేలానికి ఈ సారి 1,574 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. దీనిలో 320 మంది క్యాప్డ్ ఆటగాళ్లు కాగా.. 1,224 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. వీరితో పాటు అసోసియేట్ దేశాలకు చెందిన 30 మంది క్రికెటర్లు కూడా ఉన్నారు. మొత్తం 1,574 క్రికెటర్లలో ఫ్రాంఛైజీలు గరిష్టంగా 204 మందిని మాత్రమే ఫ్రాంచైజీలు తీసుకుంటాయి. ఈ సారి చాలా మంది స్టార్ ప్లేయర్స్ వేలంలోకి రావడంతో ఎవరికి జాక్ పాట్ తగులుతుందన్న దానిపై చాలా అంచనాలున్నాయి. విదేశీ స్టార్ ప్లేయర్స్ లో పలువురిపై కోట్లాభిషేకం ఖాయంగా కనిపిస్తోంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ వదిలేసిన ముగ్గురు ఆటగాళ్ళకు 15 కోట్ల కంటే ఎక్కువ ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరానా, శివమ్ దూబేను రిటైన్ చేసుకుంది. ఇక అన్ క్యాప్డ్ ప్లేయర్స్ జాబితాలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని 4 కోట్లతో దక్కించుకుంది.
చెన్నై వదిలేసిన పలువురు స్టార్ ప్లేయర్స్ లో ముగ్గురు న్యూజిలాండ్ ప్లేయర్స్ కు డిమాండ్ కనిపిస్తోంది. డేవాన్ కాన్వే , రచిన్ రవీంద్రతో పాటు డారిల్ మిఛెల్ పై ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరిచే అవకాశముంది. కాన్వే ఓపెనర్ గా దమ్మురేపుతున్నాడు. ఫార్మాట్ తో సబంధం లేకుండా రాణిస్తున్న కాన్వేకు 15 కోట్ల వరకు బిడ్డింగ్ వస్తుందని విశ్లేషకుల అంచనా. గత సీజన్ లో కోటి రూపాయలకే చెన్నై అతన్ని తీసుకుంది. కాన్వే తన ఐపీఎల్ కెరీర్ లో 23 మ్యాచ్ లు ఆడి 9 హాఫ్ సెంచరీలతో 923 పరుగులు చేశాడు. మరో కివీస్ ప్లేయర్ రచిన్ రవీంద్ర కూడా ఈ వేలంలో అందరికీ ఆకర్షిస్తున్నాడు. ఇటీవల భారత్ తో టెస్ట్ సిరీస్ లో వరుస సెంచరీలతో ఆకట్టుకున్న రచిన్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడే ఛాన్సుంది.
రచిన్ రవీంద్ర గత సీజన్ తోనే ఐపీఎల్ లో అడుగుపెట్టాడు. చెన్నై 1.8 కోట్లకు అతన్ని తీసుకోగా…ఆశించిన స్థాయిలో రాణించలేదు. అయినప్పటకీ రచిన్ కోసం ఈ సారి గట్టి డిమాండే కనిపిస్తోంది. అన్ని ఫార్మాట్లలోనూ కివీస్ తరపున నిలకడగా రాణిస్తుండడమే దీనికి కారణం. యువ క్రికెటర్ కావడంతో పాటు భారత్ పిచ్ లపై పూర్తి అవగాహన ఉండడం కూడా వేలంలోకి అతనికి కలిసొచ్చే అంశం. ఒకవేళ ఫ్రాంచైజీలు గట్టిగా పోటీపడితే మాత్రం 10 నుంచి 15 కోట్లు ధర పలికే ఛాన్సుంది. ఇక మిడిలార్డర్ బ్యాటింగ్ లో న్యూజిలాండ్ కు కీలకంగా ఉన్న డారిల్ మిఛెల్ పైనా అంచనాలున్నాయి. గత వేలంలో 14 కోట్ల రూపాయలకు చెన్నై అతన్ని దక్కించుకుంది. 2024 ఐపీఎల్ సీజన్ లో 13 మ్యాచ్ లు ఆడిమ మిఛెల్ 323 పరుగులు చేయగా.. రెండు హాఫ్ సెంచరీలున్నాయి. మొత్తం మీద ఈ ముగ్గురు కివీస్ క్రికెటర్లకు వేలంలో 15 కోట్ల వరకూ ధర పలకొచ్చన్నది అంచనా.