Father’s Day : ఐఏఎస్ కూతురికి ఐపీఎస్ తండ్రి సెల్యూట్.. ఫాదర్స్ డే క్యూట్ మూమెంట్…
చరిత్రే కాగుర్తించని పాత్ర నాన్న. భూమిపై కాళ్లు పెట్టే వరకు తల్లి మోస్తే.. ఆ బిడ్డ కాళ్ల మీద నిలబడేవరకు తండ్రి మోస్తాడు. ఐనా సరే గుర్తింపులేని పాత్రగానే మిగిలిపోయాడు. ఫాదర్స్ డే సందర్భంగా ఎన్నో విషయాలు గుర్తు చేసుకుంటూ.. నెటిజన్లు.. పోస్టులు పెడుతున్నారు.

IPS father salutes IAS daughter.. Father's Day cute moment...
చరిత్రే కాగుర్తించని పాత్ర నాన్న. భూమిపై కాళ్లు పెట్టే వరకు తల్లి మోస్తే.. ఆ బిడ్డ కాళ్ల మీద నిలబడేవరకు తండ్రి మోస్తాడు. ఐనా సరే గుర్తింపులేని పాత్రగానే మిగిలిపోయాడు. ఫాదర్స్ డే సందర్భంగా ఎన్నో విషయాలు గుర్తు చేసుకుంటూ.. నెటిజన్లు.. పోస్టులు పెడుతున్నారు. ఐతే ఒక్క ఫొటో మాత్రం.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది. ఐఏఎస్ కూతురికి.. ఐపీఎస్ తండ్రి సెల్యూట్ చేస్తున్న ఆ ఫొటో.. ఇప్పుడు ప్రతీ ఒక్కరి మనసు గెలుచుకుంటోంది. పిల్లల ఎదుగుదలకు మించి.. ఏ తండ్రి కోరుకునేది ఏమీ ఉండదు. ఎలా ఎదిగి కళ్లముందుకు వస్తే.. ఆ క్షణం అపురూపం.
తానే ప్రపంచాన్ని జయించినంత మురిసిపోతాడు ఆ తండ్రి. అదే జరిగింది ఇక్కడ కూడా ! కూతురు ఐఏఎస్ అధికారిణి కాగా ఐపీఎస్ అయిన తండ్రి ఆమెకు సెల్యూట్ చేశాడు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ అకాడమీకీ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులు ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం వచ్చారు. ఐఏఎస్ అధికారిణిగా వచ్చిన కూతురుకు.. ఆ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఐపీఎస్ తండ్రి సెల్యూట్ చేశాడు. ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం వచ్చిన ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారుల్లో ఉమా భారతి ఒకరు.
పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్.. ఉమాభారతికి తండ్రి. ఐఏఎస్ అధికారిణిగా వచ్చిన తన బిడ్డకు ఐపీఎస్ తండ్రి సెల్యూట్ చేసిన ఈ ఘటన.. అకాడమీలో ప్రత్యేకతను సంతరించుకుంది. ఐఏఎస్ అయిన కూతురు, ఐపీఎస్ అయిన తండ్రి సక్సెస్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తండ్రీతో ఐఏఎస్ హోదాలో సెల్యూట్ స్వీకరించిన ఉమాభారతి… ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో ట్రెయినీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఫాదర్స్‌డేకు ఒక్క రోజు ముందు ఇలాంటి అపురూప సంఘటన చోటు చేసుకోవడంతో.. ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది.