హైడ్రా రంగనాథ్: ఆయేషా మీరా టూ హైడ్రా, వయా మారుతీ రావు
హైడ్రా రంగనాథ్... ఇప్పుడు ఈ పేరు వింటే హైదరాబాద్ లో భవనాల యజమానులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. రాజకీయ నాయకులు అయినా... సినిమా నటులు అయినా... సాధారణ ప్రజలు అయినా ఎవరిని వదలను అంటూ రంగనాథ్ ప్రదర్శిస్తున్న దూకుడు ఇప్పుడు సంచలనం అవుతోంది.
హైడ్రా రంగనాథ్… ఇప్పుడు ఈ పేరు వింటే హైదరాబాద్ లో భవనాల యజమానులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. రాజకీయ నాయకులు అయినా… సినిమా నటులు అయినా… సాధారణ ప్రజలు అయినా ఎవరిని వదలను అంటూ రంగనాథ్ ప్రదర్శిస్తున్న దూకుడు ఇప్పుడు సంచలనం అవుతోంది. సిఎం రేవంత్ రెడ్డి పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం, ఫుల్ పవర్స్ రంగనాథ్ కు జీవో పేరుతో ఇచ్చేయడంతో ఎవరిని వదిలిపెట్టడం లేదు. అడ్డు వస్తే దానం నాగేందర్ లేదు, సామాన్య ప్రజలు లేరు కేసు పెట్టడమే లక్ష్యంగా వెళ్తోంది హైడ్రా.
ఇప్పటి వరకు రంగనాథ్ ఏం చేసినా సరే సిఎం అడ్డు చెప్పలేదు. ఇక ముందు చెప్పే ఛాన్స్ కూడా లేదు. దానం నాగేందర్ పై కేసు పెట్టిన తర్వాత… దానం వెళ్లి రేవంత్ కు ఫిర్యాదు చేసారు. దానిపై రేవంత్ పెద్దగా ఆసక్తి చూపలేదు. కనీసం దానిపై రంగనాథ్ తో కూడా చర్చించలేదు. మజ్లీస్ పార్టీ నేతల విషయంలో కూడా రంగనాథ్ ఇదే దూకుడు ప్రదర్శించారు. దీనితో ఇప్పుడు హైడ్రా చీఫ్ రంగనాథ్ ఎవరు అనే చర్చ మొదలయింది. ఐపిఎస్ ఆఫీసర్ గా ఆయనకు గతంలో అంత గుర్తింపు రాలేదు గాని హైడ్రా విషయంలో మాత్రం ఆయనకు మంచి పేరు వచ్చింది.
సాధారణ ప్రజల నుంచి కూడా మద్దతు వస్తోంది. ఇక ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే… సంచలన కేసులను హ్యాండిల్ చేసిన చరిత్ర ఆయన సొంతం. 2007లో ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా(ఇబ్రహీంపట్నం) హత్య కేసులో ప్రత్యేక దర్యాప్తు అధికారిగా రంగనాథ్ కీలకంగా వ్యవహరించారు.
ఆయన కనుసన్నల్లోనే ఆ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. అదే విధంగా తెలంగాణలోని నల్గొండలో అమృత- ప్రణయ్ కేసులో నిందితుడు మారుతిరావును అరెస్ట్ చేసారు. ఆ కేసు విచారణలో రంగనాథ్ చాలా కీలకంగా వ్యవహరించారు. మారుతీ రావుతో హత్యకు ముందు కూడా రంగనాథ్ మాట్లాడారు. అలాగే వరంగల్ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసును కూడా ఈయనే డీల్ చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయన సమర్ధత తెలిసిన రేవంత్… హైడ్రా బాధ్యతలు అప్పగించారు.