27 ఏళ్ళ తర్వాత టైటిల్ ముంబైదే ఇరానీ కప్
దేశవాళీ క్రికెట్ లో రంజీ ట్రోఫీ తర్వాత ప్రతిష్టాత్మక టోర్నీగా పేరున్న ఇరానీ కప్ ను ముంబై కైవసం చేసుకుంది. దాదాపు 27 ఏళ్ళ సుధీర్ఘ విరామం తర్వాత ఈ టోర్నీలో ముంబై విజేతగా నిలిచింది. రెస్టాఫ్ ఇండియాతో జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
దేశవాళీ క్రికెట్ లో రంజీ ట్రోఫీ తర్వాత ప్రతిష్టాత్మక టోర్నీగా పేరున్న ఇరానీ కప్ ను ముంబై కైవసం చేసుకుంది. దాదాపు 27 ఏళ్ళ సుధీర్ఘ విరామం తర్వాత ఈ టోర్నీలో ముంబై విజేతగా నిలిచింది. రెస్టాఫ్ ఇండియాతో జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే టోర్నీ రూల్స్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించడంతో ముంబైకి టైటిల్ దక్కింది. డబుల్ సెంచరీతో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రహానే సారథ్యంలో ముంబై రంజీ ట్రోఫీని గెలవడంతో పాటు తాజాగా ఇరానీ కప్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ముంబై 537 పరుగులు చేయగా… రెస్టాఫ్ ఇండియా 416 రన్స్ కు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో ముంబై 329 పరుగులు చేసింది.