IRDAI బీమా లో కొత్త నిబంధనలు.. వచ్చే సంవత్సరం నుంచి అమలు..
IRDAI ( ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ) వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి బీమా కోసం కొత్త నిబంధనలను తీసుకురానుంది. వచ్చే యేడాది జనవరి 1, 2024 లో బీమా సంస్థలు పాలసీలోని కనీస సదుపాయాల గురించి పాలసీదారులకు తప్పకుండా తెలియజేయాలి. ఈ నూతన నిబంధన 2024, జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.
బీమా అంటే మన కుటుంబానికి, మనకు ధన నష్టం కలిగే అవకాశాల నుండి రక్షణ పొందడాన్ని బీమా ( ఇన్సూరెన్స్ ) చేయించుకోవడం అంటారు. మరో విధంగా చెప్పాలంటే అనుకోని విపత్తుల కారణంగా వ్యక్తులకు ప్రాణ నష్టం జరిగితే బీమా సంస్థ అందజేసే ధన సహాయమే బీమా అంటారు.
IRDAI అంటే ఏమిటి ..? ఏమి చేస్తుంది..?
IRDAI చట్టం, 1999లోని సెక్షన్ 14 ద్వారా నిర్వహించబడుతుంది. ఇది IRDAI యొక్క విధులు, అధికారాలు వాటి విధులను తెలియజేస్తుంది. IRDA 2002లో IRDA (పాలసీ హోల్డర్స్ ఇంట్రెస్ట్ రక్షణ) రెగ్యులేషన్స్ అనే తీర్మానాన్ని ఆమోదం పొందింది. పాలసీని కొనుగోలు చేసినప్పటి నుండి పాలసీదారు యొక్క ప్రయోజనాలకు రక్షణ ఉండేలా బీమా కంపెనీలు, వాటి మధ్యవర్తులు అనుసరించాల్సిన నియమాలను రూపొందించారు.
2024, జనవరి 1 నుంచి బీమా కవరేజీ..
IRDAI ( ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ) వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి బీమా కోసం కొత్త నిబంధనలను తీసుకురానుంది. వచ్చే యేడాది జనవరి 1, 2024 లో బీమా సంస్థలు పాలసీలోని కనీస సదుపాయాల గురించి పాలసీదారులకు తప్పకుండా తెలియజేయాలి. ఈ నూతన నిబంధన 2024, జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ), పాలసీలో వేటికి కవరేజీ ఉంటుంది, మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్, క్లెయిమ్ ఎలా చేయాలి తదితర వివరాలను తప్పకుండా వెల్లడించాలి. అలాగే, ఫిర్యాదుల ప్రక్రియ గురించీ పాలసీదారులకు తప్పకుండా చెప్పాలి.
ఈ మేరకు కస్టమర్ సమాచార పత్రాన్ని (సీఐసీ) బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) సవరించింది. దీనివల్ల పాలసీదారులు నియమ నిబంధనలు, షరతుల గురించి సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. సవరించిన సీఐసీ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఐఆర్‌డీఏఐ ప్రకటించింది.
SURESH