CBN PROBLEMS : మోడీ ఉచ్చులో బాబు ఇరుక్కున్నాడా? ఏపీలో అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సిందే

TDP అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu)నాయుడు ఢిల్లీ వెళ్లి అమిత్ షా (Amit Shah) ను కలిసి రాగానే టీడీపీ (TDP) కి అనుకూల మీడియా తనదైన శైలిలో కొత్త రాగం అందుకుంది. రాష్ట్రం కోసం చంద్రబాబు బీజేపీ (BJP) ని కలుపుకోక తప్పట్లేదని బ్యానర్ ఐటమ్ లు రాశాయి. ఇది చదివి చాలామంది నవ్వుకున్నారు. ఏం చేసినా రాష్ట్రం కోసమేనా? 2018లో బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండాదూరం చేసుకున్నది రాష్ట్రం కోసమే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 13, 2024 | 10:22 AMLast Updated on: Feb 13, 2024 | 10:22 AM

Is Babu Stuck In Modis Trap As Many Seats As Asked In Ap Should Be Given

TDP అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu)నాయుడు ఢిల్లీ వెళ్లి అమిత్ షా (Amit Shah) ను కలిసి రాగానే టీడీపీ (TDP) కి అనుకూల మీడియా తనదైన శైలిలో కొత్త రాగం అందుకుంది. రాష్ట్రం కోసం చంద్రబాబు బీజేపీ (BJP) ని కలుపుకోక తప్పట్లేదని బ్యానర్ ఐటమ్ లు రాశాయి. ఇది చదివి చాలామంది నవ్వుకున్నారు. ఏం చేసినా రాష్ట్రం కోసమేనా? 2018లో బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండాదూరం చేసుకున్నది రాష్ట్రం కోసమే. మళ్లీ ఇప్పుడు దగ్గరవుతున్నది రాష్ట్రం కోసమే. ఇలాంటి రాతలు, కోతలు రాయడానికి టీడీపీ పత్రికలకి సిగ్గు లేకపోయినా జనానికి సిగ్గు ఉంటుంది. చంద్రబాబు నాయుడు నూటికి నూరు శాతం రాజకీయ నాయకుడు. తన అవసరాలకు తగినట్లుగా ఆయన పార్టీలకు దగ్గరవుతుంటాడు దూరమవుతుంటాడు. దీనికి రాష్ట్ర ప్రయోజనాలతో సంబంధం ఏముంటుంది? ఇప్పుడు బీజేపీని కలుపుకోవడం చంద్రబాబుకు అనివార్యం.

2018-19లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వేసిన పిల్లి మొగ్గలకి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నాడు. నరేంద్ర మోడీ వ్యక్తిగత జీవితాన్ని కించపరుస్తూ ఐ హావ్ ఫ్యామిలీ… యు డోంట్ హేవ్ ఫ్యామిలీ అంటూ బట్లర్ ఇంగ్లీష్ లో బాబు చేసిన అవహేళన మోడీ పక్కగా గుర్తుపెట్టుకునే ఉన్నారు. స్కిల్స్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్ళడం దగ్గర నుంచి ఆ కేసు సుప్రీంకోర్టుకి వెళ్లడం వరకు అంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. ఈ వ్యవహారంలో ఏపీ సీఎం జగన్ ఒక పాత్రధారి మాత్రమే. స్కిల్ స్కామ్ లో అన్ని రకాలుగా ఇరికించిన తర్వాత అసలు ఆట మొదలైంది. బిజెపికి ఏపీలో వ్యతిరేకత ఉన్నా కూడా టీడీపీ…బిజెపితో పొత్తు పెట్టుకోవాల్సిందే. పవన్ కళ్యాణ్ కూడా జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించి పొత్తులు ప్రకటన చేయడం కూడా ఈ ఆపరేషన్ లో భాగమే. మొత్తంగా ఇప్పుడు ఏపీలో బీజేపీ ఎన్ని ఎంపీ సీట్లు అడిగితే… అన్ని ఇచ్చి ఆ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత టిడిపిదే. ఆ రకంగా చంద్రబాబు ని ఫిక్స్ చేశారు మోడీ, అమిత్ షా. 2018లో చేసిన ద్రోహానికి తిరుగులేని దెబ్బ కొట్టారు.

ఏపీలో టీడీపీ బలంగా ఉన్న విశాఖ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజంపేట, అరుకు ఎంపీ సీట్లు తమకు ఇవ్వాల్సిందేనని బిజెపి మొండిగా చెప్పడం ద్వారా…ఆ సీట్లు తాను తీసుకొని టిడిపి సహకారంతో గెలిచి లోక్ సభలో సీట్ల సంఖ్య పెంచుకుంటుంది. టిడిపి తాను బలంగా ఉన్న సీట్లను బీజేపీకి, జనసేనకి వదులుకొని, బలహీనంగా ఉన్న రాయలసీమలో వైసీపీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అక్కడ కచ్చితంగా టీడీపీ కొన్ని ఎంపీ స్థానాల్లో ఓడిపోతుంది. మొత్తం మీద 25 ఎంపీ సీట్లల్లో టీడీపీ ఏడు లేదా ఎనిమిది మాత్రమే గెలుస్తుంది. బిజెపి, జనసేన 8 నుంచి 10 సీట్లు గెలుచుకుంటాయి. వైసీపీ రాయలసీమలో తన బలంతో 7 లేదా 8 సీట్లు గెలుస్తుంది. టీడీపీ, జనసేన… ఎన్డీఏ లోపల ఉండి బిజెపికి మద్దతు ఇస్తే… వైసిపి (YCP) బయట నుంచి మద్దతు ఇస్తోంది. ఎలా చూసినా పాతిక ఎంపీ సీట్లు బిజెపివే. కానీ 7… 8 గెలవడం ద్వారా బిజెపి ఏపీలో బలపడుతుంది. ఈ ఓవరాల్ గేమ్ లో చంద్రబాబు బకరాగా మిగులుతారు.
2018 -19 నాటి ద్రోహానికి మరోసారి మూల్యం చెల్లించుకుంటారు. చంద్రబాబుకు మరో మార్గం కూడా లేదు. ప్రాణం ముఖ్యమా పార్టీ ముఖ్యమా అనుకున్నప్పుడు ప్రాణమే ముఖ్యం అనుకుంటాడు చంద్రబాబు. అందుకే బిజెపి చెప్పినట్టు వినాల్సిందే. ఆయనకు మరో మార్గం లేదు. లేదంటే జైల్లో కూర్చోవాల్సి ఉంటుంది.

ఈరోజు దేశంలో మోడీ రాజకీయంగా ఒక మహాశక్తి. మోడీని ఎదుర్కోవడం కంటే ఆయనతో రాజీపడ్డమే మంచిదని విషయాన్ని చంద్రబాబు ఎప్పుడో గుర్తించారు. అందులో భాగంగానే… ఇష్టమున్నాలేకపోయినా ఈ పొత్తులు… సీట్ల సర్దుబాట్లు. ఈ రాజకీయ చదరంగంలో పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న పావులు మాత్రమే. ఈ రెండు ఎలా చెప్తే అలా ఆడతాయి. ఇష్టం లేకపోయినా బిజెపికి ఇన్ని ఎంపీ సీట్లు ఇచ్చి రాష్ట్రంలో మాత్రం అధికారం సంపాదించుకోగలిగితే చాలు అనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. అసెంబ్లీ సీట్లు కూడా మొత్తం కలిపి టిడిపికి జనసేనకు 35 వరకు ఇవ్వాల్సి వస్తుంది. అంటే టిడిపి పోటీ చేసేది కేవలం 140 మాత్రమే. ఆ 140లో సగం కూడా గెలుచుకోలేకపోతే హంగ్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు బీజేపీ కీలక శక్తిగా అవతరిస్తుంది. చంద్రబాబు పిలక.. మోడీ, పవన్ కళ్యాణ్ చేతిలోకి వెళ్తుంది. కానీ మరో మార్గం లేదు. 40 ఏళ్ల టీడీపీ ఈరోజు బిజెపితో, జనసేనతో పొత్తు పెట్టుకోకుండా మన లేని పరిస్థితి వచ్చింది. చివరికి మోడీ వేసిన ఉచ్చులో చంద్రబాబు చిక్కుకొని ఆయన ఎలా చెప్పితే అలా ఆడే దుస్థితికి తెచ్చుకున్నారు.