AR Rahaman: వాళ్లు గెంటేసినట్టే.. ఇదేం లొల్లి..?
ఏ ఆర్ రెహమాన్ రెండు ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న మ్యూజీషియన్.. బర్క్ లీ యూనివర్సిటీలో తన పాటలు పాఠాల్లా మారాయి. ఆరేంజ్ ట్యూన్స్ తో వైన్ కిక్ ఇచ్చిన రెహమాన్ ని కోలీవుడ్ గెంటేసిందా? గెంటేస్తోందా? ఈ డౌట్లకి సాలిడ్ రీజనుంది.. అనిరుద్ నుంచి ఎంతపోటీ ఉన్నా రెహమాన్ ని కాదనే సీన్ ఉందనుకోలేం. కాని రెహమాన్ మాత్రం తన అడ్డాను కోలీవుడ్ నుంచి టాలీవుడ్ మారుస్తున్నాడు.. ఇది నిజం.. అదెలా?
ఏ ఆర్ రెహామాన్ కి కోలీవు్డ కూడా బోర్ కొట్టేసిందా? లేదంటే వాళ్లే తనని పక్కన పెట్టారా? ఇది కొంతకాలంగా అరవ అడ్డాలో జరుగుతున్న చర్చ. ఈ డిస్కర్షన్ మొదలవ్వటానికి వరుసగా రెహామాన్ తెలుగు సినిమాలకు సైన్ చేయటమే కారణం.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోబుచ్చి బాబు ప్లాన్ చేసిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాకు రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఒక పాట కంపోజ్ చేశాడు. ఆతర్వాత శేఖర్ కమ్ముల మేకింగ్ లోతెరకెక్కే ట్రైలింగువల్ మూవీకి కూడా రెహామానే మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు ఈ ఆస్కార్ అచీవర్.
రెండు తెలుగు సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేసినంత మాత్రానా రెహామాన్ ఇటు షిఫ్ట్ అవుతున్నాడనలేం. అందూలోనూ శేఖర్ కమ్ముల తీయబోయే త్రి భాషాచిత్రంలో హీరో తమిళ స్టార్ ధనుష్.. సో అలా ఎలా రెహమాన్ ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నాడని అంటారనే ప్రశ్న తలెత్తుతుంది. ఐతే ఆట్లి తో బన్నీ చేయబోయే సినిమా, ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ కమిటైన మూవీ కి కూడా రెహమానే మ్యూజిక్ కంపోజ్ చేసేచాన్స్ ఉందని తెలుస్తోంది. తను మ్యూజిక్ ఇన్ స్టిట్యూట్ పెట్టే ప్రాసెస్ లో హైద్రబాద్ లో కూడా ఓ మ్యూజిక్ స్టూడియోని ప్లాన్ చేశాడట.. అదే నిజమైతే, మెల్లిగా రెహాన్ ఇటు షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నాడనే మాటే నిజమయ్యేలా ఉంది.
గతంలో రెహామాన్ కి బాలీవుడ్ లో ఇబ్బంది కరమైన పరిస్థితులొచ్చాయి. అక్కడ మ్యూజిక్ ఎలా కంపోజ్ చేయాలో, సంగీత గ్నానం లేని వాళ్లు కూడా సలహాలివ్వటం, ఓ కండల స్టార్ తో రెహమాన్ కి పొసగకపోవటంతో, బాలీవుడ్ కి రాం రాం చెప్పాడు రెహామాన్.. ఏదో వాళ్లొచ్చి తనతో పనిచేయించుకోవటం తప్ప అటు వైపు లుక్కేయట్లేదు రెహామాన్. ఇక తమిళ నాడులో అలాంటి పరిస్థితులు రెహామాన్ కి ఎదురు కాలేదు. కాని అనిరుద్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్నాడు. ఆమాత్రానికే పోటీ తట్టుకోలేక రెహామాన్ టాలీవుడ్ షిఫ్ట్ అవుతున్నాడంటే అది కామెడీనే అవుతుంది. కారణం ఏదైనా వరుసగా 4 సినిమాలు చేస్తూ, మరో వైపు ఇన్ స్టిట్యూట్ పెట్టాలని డిసైడ్ అవుతూ మొత్తానికి రెహామాన్ టాలీవుడ్ షిఫ్ట్ అయ్యేలా ఉన్నాడనే మాట గతం కొంతకాలంగా బలంగా వినిపిస్తోంది.