సిల్వర్ స్క్రీన్ పై యువీ లైఫ్ స్టోరీ హీరోగా అతనేనా ?
స్పోర్ట్స్ బయోపిక్స్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది.. గతంలో ఎంఎస్ ధోనీ, 83 వరల్డ్ కప్ , భాగ్ మిల్కా భాగ్, దంగల్ వంటి బయోపిక్స్ ఎంతటి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా క్రికెటర్ల జీవితాలపై వచ్చే సినిమాలపై అటు ఫ్యాన్స్ లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఎంతో ఆసక్తి ఉంటుంది.
స్పోర్ట్స్ బయోపిక్స్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది.. గతంలో ఎంఎస్ ధోనీ, 83 వరల్డ్ కప్ , భాగ్ మిల్కా భాగ్, దంగల్ వంటి బయోపిక్స్ ఎంతటి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా క్రికెటర్ల జీవితాలపై వచ్చే సినిమాలపై అటు ఫ్యాన్స్ లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఎంతో ఆసక్తి ఉంటుంది. తాజాగా భారత డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ పై బయోపిక్ రూపొందుతోంది. మైదానంలో దేశం కోసం ప్రత్యర్థితో తలపడిన తీరుతో పాటు, క్యాన్సర్‌తో చేసిన యువీ పోరాటాన్ని వెండితెరపైకి తీసుకురానున్నారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ యువరాజ్ సింగ్ బయోపిక్‌ను తెరకెక్కించనుంది. ఈ విషయాన్ని నిర్మాతలు భూషణ్ కుమార్, రవిభాగ్ చందక్ వెల్లడించారు. యువీ బయోపిక్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు అతిత్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్‌ను భారత్ విజయం సాధించడంలో యువరాజ్ సింగ్‌ది కీలకపాత్ర. ఆల్‌రౌండ్‌షోతో సత్తాచాటి టీమిండియాను యువీ విశ్వవిజేతగా నిలిపాడు. 2011 వన్డే వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ టోర్నీ అవార్డు అందుకున్నాడు. అయితే ఆ మెగాటోర్నీ సమయంలో యువీ క్యాన్సర్‌తోనూ పోరాడాడు. తనకి క్యాన్సర్ ఉందని తెలిసినా క్రికెట్ కు ప్రాధాన్యత ఇస్తూ పోరాటపటిమను చూపాడు. వరల్డ్‌కప్ అనంతరం చికిత్స చేయించుకుని, కోలుకుని తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు. కాగా, యువీ బయోపిక్‌లో హీరోగా ఎవరు నటిస్తారనే ఉత్కంఠ మొదలైంది. ఎంఎస్ ధోనీ బయోపిక్‌లో యువీ పాత్రను హెర్రీ తంగిరీ పోషించాడు. అతన్నే తీసుకుంటారా లేకా అగ్రహీరోల్లో ఎవరినైనా ఎంచుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.