Praneet Rao : ప్రణీత్ రావుతో ఆధారాలు ధ్వసం చేయించింది ఆయనేనా..
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో డీఎస్పీ ప్రణీత్ రావు సస్పెన్షన్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. SIBలో పనిచేస్తున్న సమయంలో విపక్షనేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆధారాలు దొరకడంతో.. ప్రణీత్‌రావుపై వేటు పడింది.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో డీఎస్పీ ప్రణీత్ రావు సస్పెన్షన్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. SIBలో పనిచేస్తున్న సమయంలో విపక్షనేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆధారాలు దొరకడంతో.. ప్రణీత్‌రావుపై వేటు పడింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తేలడంతోనే.. SOT రూమ్‌లో ప్రణీత్ రావు విధ్వంసానికి పాల్పడినట్లు గుర్తించారు అధికారులు.. ఇంతకూ ప్రణీత్‌రావును విధ్వంసానికి పాల్పడాల్సిందిగా ఆదేశించిదెవరన్న అంశంపై ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. ఇదే విషయంలో మరింత డీప్‌గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచిలో డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు.. మాజీ సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ఆయనపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రావడంతో వేటు పడింది.
గతప్రభుత్వం హయాంలో SIBలో పనిచేసిన ప్రణీత్ రావును సస్పెండ్ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులిచ్చారు. నాడు విపక్షనేతగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సైతం.. ప్రణీత్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. SIBలో SOT ఆపరేషన్‌కు హెడ్‌గా పనిచేసిన ప్రణీత్ రావు.. SIBలో SOT ఆపరేషన్‌కు హెడ్‌గా పని చేశాడు ప్రణీత్ రావు. ఆ సమయంలో రాజకీయ నేతలు, NGOలు, పౌర హక్కుల నేతల వ్యవహారాలు ఆయన చూశాడు. అదే టైంలో నేతల ఫోన్లను ట్యాప్ చేసి.. వాళ్ల సంభాషణల్ని రికార్డు చేశాడని చెప్తున్నారు అధికారులు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూల ఫలితాలు రాగానే ఆధారాలు లేకుండా ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్తున్నారు. ఎలక్ట్రీషియన్ సహాయంతో CCTV కెమెరాలు ఆఫ్ చేయించి.. డిసెంబర్ 9న రాత్రి 9 గంటల తర్వాత లాగర్ రూమ్‌లోకి ప్రణీత్ రావు వెళ్లినట్టు అధికారులు చెప్తున్నారు.
45 హార్డ్ డిస్క్‌లతో పాటు వందల కొద్ది డాక్యుమెంట్లు.. ట్యాపింగ్‌కు సంబంధించిన సమాచారంతో పాటు.. కాల్ డేటా రికార్డ్స్, IMEI నంబర్లు ధ్వంసం చేసినట్టు చెప్తున్నారు. ప్రణీత్ రావును ఎవరు ఆదేశించారు..? హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేశాలని ప్రణీత్‌రావును ఎవరు ఆదేశించారన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఆ అధికారి ఎవరనే విషయం తెలుసుకునే పనిలో ఉన్నారు అధికారులు. SIBని గతంలో లీడ్ చేసిన అధికారులే ప్రణీత్ రావుకి ఈ ఆదేశాలు ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ IPS అధికారి, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కూడా పని చేసిన ప్రభాకర్ రావు మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాకర్ రావుకు DSP ప్రణీత్ రావు బంధువు. దీంతో ప్రభాకర్ రావే వెనుక ఉండి మొత్తం కథ నడిపించారనే అనుమానిస్తున్నారు. విచారణ అనంతరం దీనిపై పూర్తి స్థాయి విషయాలు బయటికి రానున్నాయి.