ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ తేలిపోయాడు. కెప్టెన్ గా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైన హిట్ మ్యాన్, బ్యాటర్ గానూ నిరాశపరిచాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ ఆడిన 3 మ్యాచ్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే రిటైర్మెంట్ గురించి ఇప్పట్లో ఆలోచించడం లేదని రోహిత్ స్పష్టం చేశాడు. కానీ భవిష్యత్తులో టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతే టీం మేనేజ్మెంట్ కచ్చితంగా అతనిని పక్కనపెట్టేస్తుంది. రాబోయే రోజుల్లో రోహిత్‌కి అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా ఉన్న ఆటగాడి గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. దేశవాళీ క్రికెట్‌లో చాలా మంది ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. భారత జట్టులో తమకు అవకాశం కల్పిస్తే నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ రోహిత్ శర్మకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. గైక్వాడ్ ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనిని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అతను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. దేశవాళీలోను గైక్వాడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. గైక్వాడ్ 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 41.52 సగటుతో 2533 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు మరియు 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గైక్వాడ్ దేశవాళీలో ఇండియా ఏ కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గైక్వాడ్ కి ఇప్పుడు కేవలం 27 ఏళ్ళు మాత్రమే. అతనికి ఇంకా చాలా క్రికెట్ ఆడే అవకాశం ఉంది. సో రోహిత్ స్థానంలో గైక్వాడ్ ని ఆడించే అవకాశం కనిపిస్తుంది. భారత్ తరఫున రోహిత్ శర్మ మొత్తం 67 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో 40.57 సగటుతో 4301 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతను 12 సెంచరీలు మరియు 18 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. కానీ 2024లో రోహిత్ పూర్తిగా విఫలమయ్యాడు. 2024లో రోహిత్ మొత్తం 14 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు, అందులో 26 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కు చేశాడు. ఈ సమయంలో 24.76 సగటుతో 619 పరుగులు చేశాడు. మరియు కేవలం 2 సెంచరీలు మరియు 2 అర్ధసెంచరీలు మాత్రమే నమోదు చేశాడు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ పూర్తిగా విఫలమయ్యాడు. 3 మ్యాచ్‌ల్లో 31 పరుగులు మాత్రమే చేశాడు. ఇది భారత జట్టు ఓటమికి ప్రధాన కారణం.[embed]https://www.youtube.com/watch?v=aSVFyXhCcTk[/embed]