గబ్బా స్టేడియంలో సారా, శుభమన్ గిల్ కోసమేనా ?

టీమిండియా ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌, స‌చిన్ టెండూల్క‌ర్ త‌న‌య సారా టెండూల్క‌ర్ డేటింగ్ చేస్తోన్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తోన్నాయి. శుభ్‌మ‌న్ , సారా క‌లిసి దిగిన ఫొటోలు ప‌లుమార్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 14, 2024 | 07:10 PMLast Updated on: Dec 14, 2024 | 7:10 PM

Is It Because Of Sara And Shubman Gill At The Gabba Stadium

టీమిండియా ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌, స‌చిన్ టెండూల్క‌ర్ త‌న‌య సారా టెండూల్క‌ర్ డేటింగ్ చేస్తోన్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తోన్నాయి. శుభ్‌మ‌న్ , సారా క‌లిసి దిగిన ఫొటోలు ప‌లుమార్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. అలాగే శుభ్‌మ‌న్ ఆడిన మ్యాచ్‌ల‌లో సారా టెండూల్క‌ర్ క‌నిపించ‌డం కూడా ఈ పుకార్ల‌కు బ‌లాన్ని చేకూర్చింది. తాజాగా మరోసారి వీరిద్దరి టాపిక్ వైరల్ అవుతోంది. బ్రిస్బేన్ గబ్బా వేదికగా జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టుకు సారా టెండూల్కర్ హాజరవడమే దీనికి కారణం. విఐపి గ్యాలరీలో ఆమె మ్యాచ్ చూస్తూ అందరినీ సర్ ప్రైజ్ చేసింది. సారా మ్యాచ్ చూడడానికి రావడంతో అందరి కళ్ళు టీమిండియా యువ బ్యాటర్ గిల్ పైనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. సారా మ్యాచ్ కు హాజరు కావడంతో మరోసారి వీరి మధ్య పుకార్లు వస్తున్నాయి.

గిల్ ఆడుతున్నప్పుడు రావడం సారాకు ఇదే తొలిసారి కాదు. ఐపీఎల్, వన్డే వరల్డ్ కప్ సమయంలో ఆమె మ్యాచ్ లకు హాజరైంది. ఆశ్చర్యకరంగా సారా మ్యాచ్ చూడడానికి వచ్చినప్పుడల్లా గిల్ ఆట వేరే లెవల్లో ఉంటుంది. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ పై సెంచరీతో పాటు వరల్డ్ కప్ లో శ్రీలంకపై గిల్ 92 పరుగులు చేశాడు. ఈ రెండు సందర్భాల్లో సారా మ్యాచ్ చూడడానికి స్టేడియానికి వచ్చింది. మరోసారి ఆమె కనిపించడంతో గిల్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గిల్ ను సోషల్ మీడియాలోనూ సారా ఫాలో అవుతూ కామెంట్స్ చేస్తుండడం కూడా వీరి మధ్య లవ్ ట్రాక్ ఉందన్న వార్తలు మరింత బలపడ్డాయి. అయితే వీరిద్దరి పెళ్ళి వార్త‌ల‌పై అటు గిల్ ఫ్యామిలీతో పాటు ఇటు స‌చిన్ ఫ్యామిలీ ఇప్పటి వరకూ స్పందించలేదు. అయితే ఇటీవల గిల్‌, సారా రిలేష‌న్‌షిప్‌పై యూఏఈ క్రికెట‌ర్ చిరాగ్ సూరి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. ఓ ఇంట‌ర్వ్యూలో నెక్స్ట్ పెళ్లిపీట‌లు ఎక్క‌బోయే స్టార్ క్రికెట‌ర్ ఎవ‌ర‌ని అడిగిన ప్ర‌శ్న‌కు శుభ్‌మ‌న్ పేరును చెప్పాడు చిరాగ్ అలీ. శుభ్‌మ‌న్‌కు ల‌వ‌ర్ ఉంద‌ని, ఆమె పేరు సారా అని చిరాగ్ అలీ చెప్పాడు. ఆమె మ‌రెవ‌రో కాదు స‌చిన్ డాట‌ర్ అని చెప్పాడు.

మరోవైపు గతంలో ఒకసారి సారా షేర్ చేసిన ఓ ఫొటోలో ఒక కుక్క కూడా ఉంది. కొద్ది రోజుల క్రితం గిల్ పోస్ట్ చేసిన ఫొటోలో కూడా అదే కుక్క ఉంది. సారాకు గిల్ గిఫ్ట్‌గా ఇచ్చి ఉంటాడని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపించాయి. ఇక ఇటీవల మరో వార్త కూడా వైరల్ అయింది. గిల్, సారా బ్రేకప్ చెప్పేసుకున్నారని సోషల్ మీడియా కోడై కూసింది. సారాకు బ్రేకప్ చెప్పిన గిల్ బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌‌తో కలిసి తిరుగుతున్నాడని పుకార్లు వచ్చాయి. కానీ ఇప్పుడు భారత్, ఆసీస్ మూడో టెస్టులో సారా టెండూల్కర్ కనిపించడంతో గిల్ కోసమే ఆమె వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.