Pawan Kalyan : పవన్‌కు పిఠాపురంలో కష్టమేనా.. ఆయన భయంతోనే అలా చేస్తున్నారా..
లెక్కేసి కొడితే.. ఏపీలో ఎన్నికల (AP Elections) కు ఇంకో వారం రోజులు సమయం మాత్రమే ఉంది. వైసీపీ వర్సెస్ కూటమి రాజకీయాలు.. ఏపీ పాలిటిక్స్ (AP Politics) లో కాక పుట్టిస్తున్నాయ్.

Is it difficult for Pawan in Pithapuram.. is he doing it out of fear..
లెక్కేసి కొడితే.. ఏపీలో ఎన్నికల (AP Elections) కు ఇంకో వారం రోజులు సమయం మాత్రమే ఉంది. వైసీపీ వర్సెస్ కూటమి రాజకీయాలు.. ఏపీ పాలిటిక్స్ (AP Politics) లో కాక పుట్టిస్తున్నాయ్. పార్టీల వ్యూహాలు, జనాల నుంచి రెస్పాన్స్ సంగతి ఎలా ఉన్నా.. పిఠాపురం (Pithapuram) అసెంబ్లీని మాత్రం ఇప్పుడు రాష్ట్రం అంతా ఆసక్తిగా గమనిపిస్తోంది. గత ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన జనసేన అధినేత పవన్.. ఈసారి పిఠాపురం బరిలో ఉన్నారు. ఐతే సేనానికి చెక్ పెట్టేందుకు జగన్, వైసీపీ భారీ వ్యూహాలు రచిస్తోంది. వంగా గీతను బరిలో దింపి సై అంటే సై అంటోంది.
దీంతో పిఠాపురం ఓటర్ తీర్పు ఎలా ఉంటుంది.. పవన్ ఈసారైనా అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అనే సస్పెన్స్ ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. పిఠాపురంలో జనసేన తరఫున ప్రచారానికి టాలీవుడ్ ప్రముఖులు అంతా.. క్యూ కడుతున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీకి కొత్త ఆయుధంగా మారింది. పిఠాపురంలో గెలిచే అవకాశం లేదని పవన్‌కు అర్థమైందని.. అందుకే సినిమా తారలను, మెగా ఫ్యామిలీని.. పిఠాపురంలోకి దింపుతూ.. ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ సపోర్టర్లు.. సోషల్ మీడియా సాక్షిగా ఆడుకుంటున్నారు. పిఠాపురంలో పవన్‌తో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా కష్టపడుతున్నారు.
ఇక నాగబాబు భార్య పద్మజ కూడా.. మరిది కోసం పిఠాపురంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. వీళ్లకు తోు మెగా ఫ్యామిలీ హీరోలు.. ఒక్కొక్కరు రంగంలోకి దిగుతున్నారు. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఇప్పటికే పిఠాపురంలో ఓ రౌండ్ ప్రచారం చేశారు. ఇప్పుడు పవన్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా పిఠాపురంలో ల్యాండ్ అయ్యారు. ప్రచారాన్ని హోరెత్తించారు. వీళ్లకుతోడు.. సీరియల్ నటులు, జబర్దస్త్ ఆర్టిస్టులు.. డ్యాన్స్ మాస్టర్లు.. ఇలా పవన్ కోసం.. వీఐపీలంతా పిఠాపురంలో దిగిపోతున్నారు. వంగా గీతకు జనాల్లో వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్‌కు భయపడే.. పవన్ ఇలా ఒక్కొక్కరిని బరిలో దింపుతున్నారని వైసీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు.