Kangana Ranaut: పైర్ బ్రాండ్ పెళ్లి చేసుకోబోతుందా.. అసలు నిజమేంటి..?
ఎప్పుడు వివాదాలను కొని తెచ్చుకొనే పనిలో ఉండే ఈ బ్యూటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొట్టడం వైరల్‌గా మారింది. కంగనా కెరీర్ ప్రారంభంలో బాలీవుడ్ క్రేజీ హీరో హృతిక్ రోషన్‌తో ప్రేమాయణం నడిపింది.
Kangana Ranaut: కంగనా రనౌత్.. ఈ ముద్దుగుమ్మ సినిమాల గురించి దేశమంతా ఎంతమందికి తెలుసో చెప్పలేం. కానీ, ఈ బ్యూటీ చేసే కామెంట్లు, చేసే కాంట్రవర్సీలు మాత్రం తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇంకా చెప్పాలంటే రామ్‌గోపాల్ వర్మను మించి కంగనా.. అన్ని విషయాల్లో కలగజేసుకుంటోందిప్పుడు. పైగా డొంక తిరుగుడు లేకుండా.. ఏ విషయాన్నైనా స్ట్రెయిట్‌గా చెప్పడం ఈ క్యూటీకే చెల్లింది. ఎప్పుడు వివాదాలను కొని తెచ్చుకొనే పనిలో ఉండే ఈ బ్యూటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొట్టడం వైరల్‌గా మారింది.
కంగనా కెరీర్ ప్రారంభంలో బాలీవుడ్ క్రేజీ హీరో హృతిక్ రోషన్‌తో ప్రేమాయణం నడిపింది. అయితే తన లైఫ్‌లో ప్రేమ ఎన్నో చేదు అనుభవాలకు గురి చేసిందని.. కానీ ఇప్పుడు వాటి నుంచి బయటపడిపోయినట్లు చెప్పింది. ఇప్పుడు.. ఈ కాంట్రవర్సీ బ్యూటీ త్వరలో పెళ్లి చేసుకోబోతుందన్న న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. కెరీర్ పరంగా డౌన్ అయిన కంగనా.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందట. కాగా.. కంగనా పెళ్లికి సంబంధించి ప్రముఖ హిందీ క్రిటిక్ కేఆర్కే చేసిన ట్వీట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కంగనా పెళ్లి గురించి బాలీవుడ్ క్రిటిక్ కేఆర్కే చేసిన ట్విట్ బీటౌన్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ప్రముఖ బిజినెస్ మెన్‌ను కంగనా త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని.. డిసెంబర్‌లో ఎంగేజ్ మెంట్ చేసుకుని.. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకోబోతుందన్న న్యూస్ వైరల్‌గా మారింది.
అయితే తన పెళ్లి వార్తలపై కంగనా ఇప్పటి వరకు రియాక్ట్ కాకపోవడంతో ఇది నిజమనే అనుకుంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి.. ఫైర్ బ్రాండ్ ఎలా రియాక్ట్ అవుతుందో.