KCR playing : ఫోన్ ట్యాపింగ్ కేసు పక్కదారి పట్టించేందుకు.. కేసీఆర్ కొత్త నాటకాలు ఆడుతున్నారా ?
వార్ వన్‌సైడ్ అన్నట్లు కనిపించేది ఒకప్పుడు తెలంగాణ రాజకీయం. కేసీఆర్ (KCR) రాజకీయ చతురత ముందు.. కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉండేవి పార్టీలన్నీ ! అధికారం చేతిలో ఉండడంతో.. ఆడింది ఆట, పాడింది పాట అన్నట్లు సాగింది కారు పార్టీ పరిస్థితి.
వార్ వన్‌సైడ్ అన్నట్లు కనిపించేది ఒకప్పుడు తెలంగాణ రాజకీయం. కేసీఆర్ (KCR) రాజకీయ చతురత ముందు.. కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉండేవి పార్టీలన్నీ ! అధికారం చేతిలో ఉండడంతో.. ఆడింది ఆట, పాడింది పాట అన్నట్లు సాగింది కారు పార్టీ పరిస్థితి. కట్ చేస్తే.. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ వందేళ్లు వెనక్కి పోయిందని పదేపదే చెప్తున్న కాంగ్రెస్ పెద్దలు.. గులాబీ పెద్దల బాగోతాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా అంశాల సంగతి ఎలా ఉన్నా.. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.
ఈ కేసులో కీలక అధికారులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించగా.. సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయ్. అటు తిరిగి ఇటు తిరిగి ఫోన్ ట్యాపింగ్ తీగలు.. కేసీఆర్‌కు ఆయన కుటుంబం మెడకు చుట్టుకుంటున్నాయ్. మాజీ మంత్రి హరీష్ (Harish) ఆధ్వర్యంలో ట్యాపింగ్ జరిగిందని.. ఈ కేసులో కీలకంగా ఉన్న వ్యక్తులు వాంగ్మూలం ఇచ్చారు. ఓ మాజీ మంత్రి ఇన్వాల్వ్ అయ్యారంటే.. ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతుందా ! అదే అనుమానాలు వచ్చాయ్ సిట్ అధికారులకు. ఇవాళో రేపో ఈ కేసు.. కేసీఆర్ వరకు వెళ్లే అవకాశం ఉంది. బీజేపీ నేతలు ఫోన్‌లను కూడా ట్యాపింగ్ చేయడంతో.. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ గరంగరంగా ఉంది.
ఈ వ్యవహారంపై చాలా సీరియస్ అవుతోంది. ట్యాపింగ్ కేసులో సీబీఐ విచారణ కోరేలా.. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ఆలోచనలో ఉందనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. కేసీఆర్, బీఆర్ఎస్ పరిస్థితి ఊహించుకోవడానికి కూడా దారుణంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య.. ట్యాపింగ్ కేసును పక్కదారి పట్టించేందుకు గులాబీ పార్టీ కొత్త నాటకాలు మొదలుపెట్టిందనే చర్చ జరుగుతోంది. అనవసర విషయాలకు రాద్ధాంతం చేస్తూ.. కొత్త వివాదాలను తెరమీదకు తీసుకువస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. ముఖ్యంగా తెలంగాణ చిహ్నం, తెలంగాణ గీతం విషయంలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తెలంగాణ గీతానికి కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తుండగా.. దీన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కీరవాణి రాగంలో.. ఓ వివాదం పలికిస్తున్నారు.
తెలంగాణ గీతానికి.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తితో ఎలా మ్యూజిక్ చేయిస్తారని బీఆర్ఎస్ (BRS) వ్యతిరేకిస్తోంది. ఇది తెలంగాణ సమాజాన్ని అవమానించడమే అని.. మళ్లీ ఆంధ్రా పెత్తనం ఏంటి అంటూ.. వివాదం క్రియేట్ చేస్తోంది. తెలంగాణ లోగో విషయంలోనూ ఇలాంటి రచ్చే మొదలుపెట్టింది. లోగో సంగతి పక్కనపెడితే.. తెలంగాణ గీతం మీద మెజారిటీ జనాలకు పెద్దగా అభ్యంతరం లేదు అనే చర్చ జరుగుతోంది. ఐతే బీఆర్ఎస్ కావాలని రచ్చ మొదలుపెట్టడం వెనక… అసలు వ్యూహం ఫోన్ ట్యాపింగ్ కేసును పక్క దారి పట్టించేందుకే అనే చర్చ జరుగుతోంది. ఏఆర్ రహమాన్ (AR Rahman) సంగీతం, గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో అప్పట్లో బీఆర్ఎస్ ఓ బతుకమ్మ పాట రిలీజ్ చేసింది. ఆ ఇద్దరు కూడా తమిళులే ! ఐతే అప్పుడు ప్రాంతాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు మరికొందరు. తప్పులను కవర్ చేసుకునేందుకు, పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు.. ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ లోకల్ సెంటిమెంట్ రాజేస్తోందని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు సోషల్ మీడియాలో.