KCR : కాంగ్రెస్‌లోకి కీలక నాయకులను కేసీఆరే పంపిస్తున్నారా ?

తెలంగాణలో అధికారం కోల్పోయిన తరువాత బీఆర్‌ఎస్‌ పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. ఒకప్పుడు కేసీఆర్ వెంటే తిరిగిన చాలా మంది నేతలు.. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా పార్టీ మారిపోతున్నారు. టికెట్‌ ఇస్తాం అన్నా కూడా పార్టీ వదిలి వెళ్లిపోతున్నారు అంటే.. బీఆర్ఎస్‌ ఎలాంటి సిచ్యువేషన్‌ ఫేస్‌ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 31, 2024 | 07:32 PMLast Updated on: Mar 31, 2024 | 7:32 PM

Is Kcr Sending Key Leaders To Congress

తెలంగాణలో అధికారం కోల్పోయిన తరువాత బీఆర్‌ఎస్‌ పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. ఒకప్పుడు కేసీఆర్ వెంటే తిరిగిన చాలా మంది నేతలు.. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా పార్టీ మారిపోతున్నారు. టికెట్‌ ఇస్తాం అన్నా కూడా పార్టీ వదిలి వెళ్లిపోతున్నారు అంటే.. బీఆర్ఎస్‌ ఎలాంటి సిచ్యువేషన్‌ ఫేస్‌ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని రోజుల్లోనే పార్లమెంట్‌ ఎన్నికలు ఉన్నాయి. పార్టీ నేతలంతా దూరమవుతున్నారు. పోటీ చేసేందుకు కూడా చాలా మంది వెనకాడుతున్నారు. కేటీఆర్‌తో మొదలు పార్టీ కార్యకర్తల వరకూ ప్రతీ ఒక్కరూ ఈ విషయంలో టెన్షన్‌ పడుతూనే ఉన్నారు. ఒక్క కేసీఆర్‌ తప్ప. కొన్ని రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. పార్టీలో ఉన్న కీలక నేతలంగా వరుసగా పార్టీ మారుతున్నారు.

ఇలాంటి టైంలో కూడా కేసీఆర్‌ చాలా కూల్‌గా కామ్‌ ఉండటం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఇంత జరిగినా సైలెంట్‌గా ఉండటానికి కేసీఆర్‌ నార్మల్‌ లీడర్‌ కాదు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం. రాష్ట్రం కోసం 14 ఏళ్లు పోరాటం. రాష్ట్ర సీఎంగా 10 ఏళ్ల పనితనం. ఇవన్నీ ఉన్నా కేసీఆర్‌ సైలెంట్‌గా ఉంటున్నారు అంటే.. దాని వెనక ఏదో కారణం ఉంది అనేది చాలా మంది విశ్లేషకుల మదిలో మెదులుతున్న మాట. ఇప్పుడు పార్టీ మారిన చాలా మంది నేతలు బీఆర్ఎస్‌లో రాజభోగాలు అనుభవించినవాళ్లే. బీఆర్ఎస్‌ ఓడిపోగానే ఇప్పుడు వాళ్లంతా కండువా మార్చేశారు. పదవుల కోసం అధికారం కోసం ఆస్తులు కాపాడుకోవడం కోసం వీళ్లంతా పార్టీ మారితే ఓకే.. కానీ కేసీఆరే వీళ్లను కావాలని కాంగ్రెస్‌లోకి పంపిస్తున్నారు అని అక్కడక్కడా వినిపిస్తున్న మాట ఇప్పుడు రాజకీయా వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారుతోంది.

మన అనుకున్నవాళ్లను ప్రత్యర్థి పార్టీలోకి పంపి వాళ్ల వ్యూహాలు తెలుసుకుని దెబ్బ కొట్టండం రాజకీయాల్లో చాలా కామన్‌. ఇప్పుడు కేసీఆర్‌ కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇంత మంది పార్టీ మారుతున్నా కేసీఆర్‌ ఒక్క మాట కూడా అనకపోవడం ఆ అనుమాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. పార్టీని ఎవరూ పడగొట్టకుండా బలంగా మార్చేందుకు ఇతర పార్టీ నాయకులను చేర్చుకుంటున్నామంటూ రేవంత్‌ చెప్తున్నారు. వీళ్లతో వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో డెసిషన్‌ మేకింగ్‌ స్థాయిలో సీట్లు సాధించాలనేది కాంగ్రెస్‌ వ్యూహం. ఈ జాయినింగ్స్‌ అన్నీ కాంగ్రెస్‌ అధికారం చూసి జరిగితే ఓకే.. కానీ అంతా అనుమానిస్తున్నట్టు కేసీఆర్‌ కోసమే వీళ్లంతా పార్టీ మారి ఆ తరువాత మళ్లీ బీఆర్ఎస్‌ కోసం పని చేస్తే అది తెలంగాణలో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ అవుతుంది అంటున్నారు విశ్లేషకులు.