పంత్ ది ఫేక్ గాయమా ? తొండి చేశాడంటున్న ఫ్యాన్స్

ఐపీఎల్ 2025 సీజన్‍లో లక్నో సూపర్ జెయింట్స్ విన్నింగ్ రన్ కంటిన్యూ అవుతోంది. మధ్యలో కాస్త తడబడినా ఇప్పుడు టాప్ టీమ్స్ కు షాకిస్తూ అదరగొడుతోంది. తాజాగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‍కతా నైట్‍రైడర్స్‌పై లక్నో అద్భుత విజయాన్ని అందుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 10, 2025 | 08:07 PMLast Updated on: Apr 10, 2025 | 8:07 PM

Is Pant The Fake Gaia Fans Say He Did It Wrong

ఐపీఎల్ 2025 సీజన్‍లో లక్నో సూపర్ జెయింట్స్ విన్నింగ్ రన్ కంటిన్యూ అవుతోంది. మధ్యలో కాస్త తడబడినా ఇప్పుడు టాప్ టీమ్స్ కు షాకిస్తూ అదరగొడుతోంది. తాజాగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‍కతా నైట్‍రైడర్స్‌పై లక్నో అద్భుత విజయాన్ని అందుకుంది. పరుగుల వరద పారిన మ్యాచ్ లో లక్నో కేవలం 4 రన్స్ తేడాతో గెలిచింది. అయితే, ఈ మ్యాచ్‍లో పంత్ ఓ మాస్టర్ ప్లాన్ అమలు చేశాడని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అంటున్నారు. ఫేక్ ఇంజ్యూరీ చూపించి ప్రత్యర్థి బ్యాటర్ల లయను దెబ్బతీశాడని చెబుతున్నారు. ఛేజింగ్ లో కోల్‍కతా కూడా దూకుడుగా ఆడింది. 12 ఓవర్లలోనే కేకేఆర్ 2 వికెట్లకు 149 పరుగులతో గెలిచేలా కనిపించింది. కానీ 13వ ఓవర్ చివర్లో రహానేను లక్నో పేసర్ శార్దూల్ ఠాకూర్ ఔట్ చేయడంతో లక్నోకు బ్రేక్‍త్రూ దక్కింది. ఆ తర్వాత కేకేఆర్ వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయింది.

13వ ఓవర్ ప్రారంభంలో రిషబ్ పంత్ నడుము నొప్పితో బాధపడ్డాడు. దీంతో లక్నో ఫిజియో గ్రౌండ్‍లోకి వచ్చి పంత్‍కు అక్కడే ట్రీట్‍మెంట్ చేశాడు. దీంతో మ్యాచ్ కాసేపు నిలిచింది. రహానే, వెంకటేశ్ అయ్యర్ జోరుగా ఆడుతుండటంతో వారి లయను దెబ్బ తీయాలనే బ్రేక్ వచ్చేలా ఫేక్ ఇంజూరి ప్లాన్‍ను పంత్ అమలు చేశాడని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. గతేడాది 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్‍లో పంత్ ఫేక్ ఇంజూరి ప్లాన్ అమలు చేశాడు. ఆ ఫైనల్‍లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ దూకుడుగా ఆడుతుండటంతో ఆ జట్టు గెలిచేలా కనిపిచింది. ఓ దశలో గాయంతో అల్లాడుతున్నట్టు పంత్ చేశాడు. దీంతో ఆటకు బ్రేక్ పడింది. ఆ వెంటనే క్లాసెన్ ఔటయ్యాడు. వరుసగా వికెట్లు కోల్పోయి చివరికి దక్షిణాఫ్రికా ఓడింది. భారత్ టైటిట్ పట్టింది. అయితే, గాయమైనట్టు తాను అప్పుడు కావాలనే నాటకం ఆడానని, దక్షిణాఫ్రికా బ్యాటర్ల లయను దెబ్బకొట్టేందుకు అలా చేశానని పంత్ స్వయంగా చెప్పాడు. టీ20 ప్రపంచకప్‍లో ఫాలో అయిన మాస్టర్ ప్లాన్‍నే ఐపీఎల్‍లో కోల్‍కతాతో మ్యాచ్‍లో పంత్ ఫాలో అయ్యాడని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్నారు. మరి పంత్ నిజంగానే ఇబ్బంది పడ్డాడా.. లేకపోతే కావాలనే చేశాడా అనేది ఇప్పటికైతే సస్పెన్స్ గానే ఉంది.

ఇదిలా ఉంటే పంత్ తొండాట ఆడాడని కేకేఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరించిన అతనిపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది.మరికొందరు మాత్రం పంత్‌కు అండగా నిలుస్తున్నారు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఇలానే గాయం నాటకం ఆడిన పంత్‌ను మెచ్చుకున్న అభిమానులు ఇప్పుడు తిట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.