Prakash Raj: బీజేపీలోకి ప్రకాష్ రాజ్.. ఈ ప్రచారంలో నిజమెంత..?
స్కిన్ డాక్టర్ అనే ఒక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ నుంచి గురువారం.. ప్రకాష్ రాజ్ బీజేపీలో చేరుతున్నారని ట్వీట్ వచ్చింది. క్షణాల్లోనే ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందించారు.
Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. రాజకీయాలపై ఎప్పుడూ స్పందిస్తూనే ఉంటారు. ముఖ్యంగా బీజేపీ, మోదీ సిద్ధాంతాలపై తరచూ విమర్శనాస్త్రాలు సంధిస్తారు. అలాంటి ప్రకాష్ రాజ్ గురించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. అదే.. ప్రకాష్ రాజ్ బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. స్కిన్ డాక్టర్ అనే ఒక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ నుంచి గురువారం.. ప్రకాష్ రాజ్ బీజేపీలో చేరుతున్నారని ట్వీట్ వచ్చింది.
KAVITHA: లిక్కర్ స్కాంలో కవితకు షాక్.. తిహార్ జైలులో విచారించనున్న సీబీఐ
క్షణాల్లోనే ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందించారు. నిత్యం బీజేపీని, మోదీని విమర్శించే ప్రకాష్ రాజ్ బీజేపీలో చేరడమేంటని పలువురు ఆశ్చర్యపోయారు. ఇది నిజంగా జరుగుతుందా అని కొందరు.. ఏమో రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని ఇంకొందరు కామెంట్లు చేశారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఈ అంశానికి మీడియా ప్రాధాన్యం ఇచ్చింది. అసలే.. ప్రస్తుతం ఎవరు.. ఏ పార్టీలో ఉంటున్నారో తెలియని పరిస్థితి. సిద్ధాంతాలు పక్కనబెట్టి నేతలంతా టిక్కెట్ల కోసం పార్టీలు మారేస్తున్నారు. దీంతో ప్రకాష్ రాజ్ కూడా బీజేపీ కండువా కప్పుకొంటారా అనే చర్చ మొదలైంది. మొత్తానికి ఈ అంశం వైరల్ కావడంతో నేరుగా ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. “బహుశా వాళ్లు (బీజేపీ) నాకోసం ప్రయత్నించి ఉండొచ్చు. కానీ, వాళ్లు నన్ను (సిద్ధాంత పరంగా) కొనేంత సత్తా లేదని తెలుసుకుని ఉంటారు. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్.. జస్ట్ ఆస్కింగ్” అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.
గత జనవరిలో కూడా ప్రకాష్ రాజ్.. రాజకీయాలపై స్పందించారు. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం మూడు పార్టీలు తనను సంప్రదించాయని.. అయితే, తన సిద్ధాంతాలు నచ్చి కాదని, ప్రధాని మోదీని తిడతాననే తనకోసం ప్రయత్నిస్తున్నాయన్నారు. తాను ఆ పార్టీల ట్రాప్‌లో పడదల్చుకోలేదని చెప్పారు. గతంలో ఒకసారి కర్ణాటక నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.
I guess they tried 😂😂😂 must have realised they were not rich enough (ideologically) to buy me.. 😝😝😝.. what do you think friends #justasking pic.twitter.com/CCwz5J6pOU
— Prakash Raj (@prakashraaj) April 4, 2024