సానియా రెండో పెళ్ళి నిజమేనా ? టెన్నిస్ స్టార్ పై రూమర్స్
భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రెండో పెళ్లిపై నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఆరు నెలల క్రితం పాకిస్తాన్ క్రికెటర్ షోయాబ్ మాలిక్‌తో తన బంధాన్ని తెంచుకున్న సానియా.. ఈమధ్య మరో వ్యక్తిని రహస్యంగా పెళ్లాడిందనే వార్తలు గుప్పుమంటున్నాయి.

భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రెండో పెళ్లిపై నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఆరు నెలల క్రితం పాకిస్తాన్ క్రికెటర్ షోయాబ్ మాలిక్‌తో తన బంధాన్ని తెంచుకున్న సానియా.. ఈమధ్య మరో వ్యక్తిని రహస్యంగా పెళ్లాడిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అది కూడా ఆమె రెండో పెళ్లి మరోసారి పాకిస్థానీ వ్యక్తితోనే జరిగిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాంతో, సానియా పెళ్లి గోల మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. షోయబ్ మాలిక్ వివాహమాడిన రెండో భార్య మాజీ భర్త ఉమైర్ జస్వాల్ నే సానియా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నట్టు పుకార్లు వస్తున్నాయి. సానియానే అతను పెళ్ళి చేసుకున్నట్టు ఎటువంటి ఆధారమూ లేకున్నా నెట్ లో పుకార్లు మాత్రం ఆగడం లేదు.