SITHAKKA PCC RACE : పీసీసీ అధ్యక్ష రేసులో సీతక్క రేవంత్ ఛాయిస్ ఆమేనా ?
తెలంగాణ కాంగ్రెస్ లో జూన్ 4 ఫలితాల తర్వాత కీలక మార్పులు జరగబోతున్నాయి. పీసీసీ చీఫ్ పదవి నుంచి సీఎం రేవంత్ రెడ్డి తప్పుకోబోతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ లో జూన్ 4 ఫలితాల తర్వాత కీలక మార్పులు జరగబోతున్నాయి. పీసీసీ చీఫ్ పదవి నుంచి సీఎం రేవంత్ రెడ్డి తప్పుకోబోతున్నారు. కొత్త అధ్యక్షుడిగా ఎవర్ని నియమించాలన్న దానిపై పార్టీలో తర్జన భర్జన జరుగుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డికి మరింత ఫ్రీ హ్యాండ్ ఇవ్వబోతోంది ఆ పార్టీ అధిష్టానం. పీసీసీ అధ్యక్షుడి విషయంలో ఆయన ఛాయిస్ కే ప్రియారిటీ ఇస్తారని సమాచారం. రేవంత్ ను సీఎంగా ప్రకటింనప్పుడు… భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ చీఫ్ పై హైకమాండ్ హామీ ఇచ్చినట్టు చెబుతారు. కానీ ఇప్పుడు రేవంత్ సహా మంత్రులంతా కలసి పనిచేస్తున్నారు. అందుకే పీసీసీ ఎంపిక బాధ్యతను రేవంత్ కే AICC అప్పగించనుంది.
ఈ పదవి కోసం సీనియర్లు జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ రేవంత్ మాత్రం … సీతక్క పేరును ప్రతిపాదించినట్టు సమాచారం. గిరిజన మహిళకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే… సామాజిక సమీకరణాలు కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంటాయని చెప్పినట్టు తెలుస్తోంది. సీతక్క పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారు. అలాగే మిగతా కాంగ్రెస్ సీనియర్లు కూడా ఆమెకు సహకరించే అవకాశముందని అంటున్నారు. సీతక్క పీసీసీ బాధ్యతలు చేపడితే ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించే ఛాన్సుంది. మంత్రి, పీసీసీ చీఫ్ రెండు పదవుల్లో కొనసాగితే తప్పేముందన్న వాదన కూడా వస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక… పీసీసీ చీఫ్ నియామకం పూర్తి చేసి… ఆ తర్వాత కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ లాంటి నిర్ణయాలను రేవంత్ రెడ్డి తీసుకోబోతున్నారు