Social Media : సోషల్ మీడియాతో పిల్లలకు ముప్పు తప్పదా..?

సోషల్ మీడియా.. ప్రపంచంలో ఎన్నో మీడియాలు ఉన్న వాటన్నిటి కన్నా సోషల్ మీడియా అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంది. ఎంతా అంటే పని లేని వాడు ఉంటదేమో కానీ.. సోషల్ మీడియా లో అకౌంట్ లేని వ్యక్తి అనేవాడే లేడు. మరో విధంగా చెప్పాలంటే సోషల్ మీడియా వాడి పని. సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో.. అంతకు మించి అనర్థాలు కూడా ఉన్నాయన్న విషయం తెలిసిందే. నిజానికి మూడు గంటల కంటే ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే ఉంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 12, 2023 | 10:39 AMLast Updated on: Oct 12, 2023 | 10:39 AM

Is Social Media A Threat To Children At What Age Should Children Create An Account On Social Media

సోషల్ మీడియా.. ప్రపంచంలో ఎన్నో మీడియాలు ఉన్న వాటన్నిటి కన్నా సోషల్ మీడియా అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంది. ఎంతా అంటే పని లేని వాడు ఉంటదేమో కానీ.. సోషల్ మీడియా లో అకౌంట్ లేని వ్యక్తి అనేవాడే లేడు. మరో విధంగా చెప్పాలంటే సోషల్ మీడియా వాడి పని. సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో.. అంతకు మించి అనర్థాలు కూడా ఉన్నాయన్న విషయం తెలిసిందే. నిజానికి మూడు గంటల కంటే ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. పిల్లలు, టీనేజర్స్, పెద్దలు కూడా. ఎంతలా అంటే రోజువారీ పనుల నిలుపుకున్న మరి సోషల్ మీడియా ను వినియోగిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువ సేపు గడపడం ద్వారా అనేక సమస్యలు వస్తాయని, తద్వారా మనిషి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అనేక పరిశోధనలు ఇప్పటికే తేల్చి చెప్పాయి.

ఏ వయసులో సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేయాలి..?

నిజానికి.. సోష‌ల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఆ యూజ‌ర్‌కు ఖ‌చ్చితంగా 13 ఏళ్ల వ‌య‌సు ఉండాలి. అంటే.. సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేసిన వాళ్ల లెక్క‌ల ప్ర‌కారం.. చాలా వరకు 13 ఏళ్ల వయసు లేని వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నారు. ఓ విధంగా చెప్పలాంటే 11 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న పిల్ల‌ల‌కు ఎట్టిప‌రిస్థితుల్లోనూ సోష‌ల్ మీడియాను పరిచడం చేయకూడాదు. ఎందుకంటే.. ఆ వయసులోనే మెద‌డులో కొన్ని కిలకమైన మార్పులు జరుగుతాయి. అటువంటి స‌మ‌యంలో సోష‌ల్ మీడియా అల‌వాటు చేస్తే.. వాళ్ల ఆలోచనల్లో మార్పులు వ‌స్తాయ‌ట‌. సోష‌ల్ మీడియాను చూస్తూ పిల్ల‌ల్లో ర‌క‌ర‌కాల ప్ర‌వ‌ర్త‌న‌లలను నేర్చుకుంటాన్నారు.

socialmedia

socialmedia

కౌమార దశలో సోషల్ మీడియాను వాడటం మంచిదా..?

కౌమార దశలో 15 నుంచి 18 ఏళ్ల వయసుగల యువతి, యువకులు తమ అవయవాల్లో కొన్ని కీలక మార్పులు రావడం జరుగుంది. బాలికల్లో రుతుస్రావం జరగడం, బాలురలో ఇంద్రియస్కలనం జరగడం వంటివి జరుగుతుంటాయి. శరీరంలో వస్తున్న ఈ మార్పులు తన ఆలోచనలు పక్కవారితో పోల్చుకోవడం మొదలు పెడతారు. అంటే తనలో వచ్చిన మార్పులు నా స్నేహితులలో కూడా వచ్చాయి. లేక నాకు మాత్రమే వచ్చాయ అని ఆలోచనతో అయోమయంలో పడుతారు. ఇక సమాజం మొత్తం నాకు తెలుసు అని స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలా ఫేస్ బుక్, వాట్సాప్, ఇంటర్నెట్, యూట్యూబు వంటి ప్రముఖ సోషల్ మీడియా యాప్ ల వెంట పడతారు. వాట్సాప్, ఫేస్బుక్, మెసెంజర్ లో చాటింగ్ చేస్తున్న ఇతరుల మాయలో పడిపోతున్నారు. ఈ వయసు గల యువకులు మాత్రమే స్మార్ట్ ఫోన్ ఉంటే వారి దాంట్లో చూడకూడని నీలిచిత్రాలు చూడడం, వాటిని చేయాలని కోరిక రావడం వంటివి జరుగుతాయి. నిజానికి ఇందులో ఆ యువకుడి తప్పు ఏ మాత్రం లేదు. పెరుగుతున్న కొద్ది వయసులో వచ్చే మార్పులు అతడిని ఇలా బలోపేతం చేస్తాయి. కానీ వీటన్నిటి ని తన ఆదినంలో పెట్టుకోని నిగ్రహంగ ఉంటాడో.. అతని జీవితం ఉన్నత లక్ష్యాలకు చేరుతాడు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్న మాట.

తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణం మా..?

పిల్లలు పెరుగుతున్న వయసులో తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఎంతో గాని ఉంది. పిల్లలకు ఏ వయసులో చెప్పవలసిన విషయాలు, ఆ వయసులో చెప్పాలి. పెద్ద వాళ్ళు మాట్లాడుతున్న సమయంలో పిల్లలు అక్కడ ఉండకూడదు. పెద్దవాళ్ల వ్యవహారంలో అనకూడని మాటలు, చెప్పకుడాని పదలు వాళ్లు ఉపయోగిస్తుం ఉంటారు. పిల్లలు కూడా వాటిని విని.. ఎక్కడో అక్కడ వినియోగిస్తుంటారు. మరోకటి పెద్దలతో పిల్లలు ఏలా మాట్లాడాలి అని తెలియదు.. నోటికి ఎంత వస్తే అలా మాట్లాడుతారు. ఒక్కోసారి బూతు పురాణం కూడా మాట్లాడుతారు. ఆ వయసులో ఏది మంచి, చెడు, అన్నది వారికి తెలియదు. పిల్లల మనసు నిలకడ లేనిది ఏ సమయంలోనైనా వారు ఆత్మహత్యలకు పాల్పడవచ్చు.. ఇలా జరిగిన ఘటనలో ఎన్నో.

సోషల్ మీడియా ద్వారా.. సైబర్ బెదిరింపులు..!

సోషల్ మీడియాలో సన్నిహితులతో గాని, అపరిచితుల వ్యక్తులతో గాని అమ్మాయిలు లేదా అబ్బాయిలు కొన్ని సార్లు మత వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల తమ వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ కేటుగాళ్లు దొంగిలించే ప్రమాదం ఎంతోగాని ఉంది. మరి కొన్ని సార్లు అమ్మాయిలు తమ ప్రియుడితో కొన్ని చేయకూడని పనులు సోషల్ మీడియా ద్వారా చేస్తుంటారు. ఆ సమయంలో సైబర్ నేరగాళ్లు ఆ వీడియోలను గాని, ఫొటోస్ గాని దొంగలించి బెదిరింపులకు పాల్పడుతారు. దీంతో మానసిక వోత్తిడ్లకు గురై ఆత్మహత్యలకు కేసులు ఈ మధ్య కాలంలో చాలా పెరుగుతున్నట్లు అనేక నివేదికలు పేర్కొన్నాయి.

సోషల్ మీడియాతో మెదడుకు ముప్పు తప్పదా..!

సోషల్ మీడియా ని వినియోగించడం దానిలోనే ఎక్కు వ సమయం గడపడం వల్ల పిల్లలకు, టీనేజర్లలో మానసిక సమస్యలు తలెత్తుతాయి. ఎం జరుగుతుంది అని మళ్లీ సోషల్ మీడియాను వాడటం వల్ల ఆ సమస్యలు రెట్టింపువుతాయంటున్నారుఅమెరికాకు చెందిన ఆరోగ్య నిపుణులు. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంది. అయినప్పటికి ప్రపంచ వ్యాప్తంగా వాటిపై సరైన ఆధారాలు మాత్రం వెల్లడించలేదు.

పిల్లలకు ఈ వయస్సులో మెదడు చాలా సున్నితంగా ఉంటుంది.. ఈ వయసులో మెదడులో కొన్ని కీలక మార్పులకు లోనవుతుంది. కౌమారదశలో పిల్లలు ఆలోచించడం.. కొత్త ఆలోచన వైపు ఆకర్షితులు కావడం ఇలా జరుగుతుంది. ఈ వయసులో పిల్లలపై ఎప్పుడు నిఘా ఉంచాలి. చాలా రిస్కు కలిగిన పనులు చేయుటకు ఎక్కువగా మెగ్గు చూపుతారు. దీంతో చాలా ఒత్తిడిని ఎదుర్కొంటారు. కౌమారదశలో తొలినాళ్లలోనే వ్యక్తిత్వ, ఆలోచనలకు పునాది పడుతుంది. ఈ దశలో సమాజంలో జరుగుతున్న మంచి చెడులు సామాజికపరమైన ఒత్తిళ్లు, సహచరుల విమర్శలు తోటివారితో పోల్చుకోవడాలూ, ప్రతి విమర్శలు చేసుకోవడం ఎక్కువై మెదడు ఎదుగుదల పైనా ఆ ప్రభావం పడుతుంది. దీని వల్ల మెదడులోని అమి గ్డాలా ( భావోద్వేగాలనూ, ప్రవర్తననూ నిర్థారించే భాగం) లో విపరీత మార్పులు చోటుచేసుకుంటాయి. దాంతో భావోద్వేగాలు అదుపులో ఉండవు.  అర్ధరాత్రి వరకు ఫోన్ చూస్తుండటం వల్ల నిద్రలేమి తోడవుతుంది.  ఇక అదే సమయం అలవాటుగా మరీ నిద్ర సరిగ్గా పట్టదు. దీదీనివల్ల మెదడులోని నరాల అభివృద్ధి మార్పులకు లోనవుతుంది. ఫలితంగా వారిలో నిరాశా, నిస్పృహలు, ఆత్మహత్య ఆలోచనలూ పెరుగుతాయి.. వాటిని వెంటే ఆచరణలో పెడతారు పిల్లలు. కాబట్టి పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై తల్లిదండ్రులతో ప్రభుత్వాలూ ప్రత్యేక దృష్టి పెట్టాలని సలహా ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

సోషల్ మీడియా నుంచి దూరం అయ్యే మార్గాలు..

మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి.

మీ ఫోన్లో సోషల్ మీడియా నోటిఫికేషన్లను ఆఫ్ లో పెట్టుకొండి.

ఆన్‌లైన్‌లో ఎక్కువ సేపు గడపకండి.

ఎక్కువ సమయం ఇంటి పనుల్లో లీనమవ్వండి.

సమయం కేటాయించి తల్లింద్రులతో ముచ్చటించండి.

సోషల్ మీడియా నోటిఫికేషన్లను నిలిపివేయండి.

మీరు సోషల్ మీడియాలో ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారో తెలుసుకోవడానికి యాప్‌ను ఉపయోగించండి.

ఎక్కువ శాతం మీ స్నేహితులతో మీ మనస్సు విప్పి మాట్లాడండి.

ప్రతి చిన్న సంఘటనను ఫోటోలు తీయడం మానేయండి.

ప్రతి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మానేయండి.

ఎవరిపైనా మీరు మనసులో నెగెటివ్ ఫీలింగ్స్‌ను పేట్టుకొంకండి.

భయాలను నివారించడానికి మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవడం మానేయండి.

పుత్తకాలను పఠనికరణ చేయడం అలావు చేసుకొండి.

అప్పుడప్పుడు పెన్ను పట్టి మీకు ఇష్టమైన కవిత, కథ, సాహత్యం, పాటలు రాయండ అలావాటు చేసుకోండి

మీ సృజనాత్మకత, నైపుణ్యాలను పెంచుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకోండి.

S.SURESH