Mogalirekulu Pavitranath : పవిత్ర జీవితంలో ఇంత విషాదమా.. మరణానికి అదే కారణమా ?
మొగలిరేకులు(Mogalirekulu), చక్రవాకం (Chakravakam) ఫేమ్.. పవిత్రనాథ్ (Pavitranath) మరణం.. తెలుగు టీవీ ఇండస్ట్రీలో విషాదం నింపింది. మొగలిరేకులు మూవీలో దయ పాత్రతో పేరు తెచ్చుకున్న పవిత్రనాథ్(Pavitranath).. ఇక లేరు అనే విషయాన్ని అభిమానులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Is such a tragedy in holy life.. is it the cause of death?
మొగలిరేకులు(Mogalirekulu), చక్రవాకం (Chakravakam) ఫేమ్.. పవిత్రనాథ్ (Pavitranath) మరణం.. తెలుగు టీవీ ఇండస్ట్రీలో విషాదం నింపింది. మొగలిరేకులు మూవీలో దయ పాత్రతో పేరు తెచ్చుకున్న పవిత్రనాథ్(Pavitranath).. ఇక లేరు అనే విషయాన్ని అభిమానులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. చక్రవాకం, మొగలిరేకులు, కృష్ణ తులిసి సీరియళ్లు ఆయనకు ఎంతో పేరు తీసుకువచ్చాయ్. చిన్న వయసులోనే చనిపోవడంతో.. ఇండస్ట్రీ వర్గాలు, ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి గురవుతున్నారు. నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన.. సోషల్ మీడియా ద్వారా పవిత్రనాథ్ మరణం చెప్పింది. మేఘన్ పెట్టిన పోస్ట్.. ప్రతీ ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. పవి.. ఈ బాధని జీర్ణించుకోలేకపోతున్నాం.
మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైనవాడివి. నువ్వు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం, నిన్ను చాలా మిస్ అవుతున్నాం, చివరి చూపు కూడా చూడలేదు, నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది మేఘనా. ఐతే గుండెపోటుతో చనిపోయాడనే ప్రచారం జరుగుతున్నా.. పవిత్రనాథ్ మరణానికి స్పష్టమైన కారణాలు తెలియడం లేదు. కొన్నేళ్లుగా పవిత్రనాథ్ పర్సనల్ లైఫ్‌పై చాలా వివాదాలు ఉన్నాయ్. కొన్నేళ్ల నుంచి పవిత్రనాథ్ భార్య శశిరేఖ (Sasirekha).. అతడిపై ఆరోపణలు చేస్తోంది. పవిత్రనాథ్‌కి అమ్మాయిల పిచ్చి ఉందని ఆరోపించింది.
తనని బాగా టార్చర్ చేశాడని.. తన ముందే వేరే అమ్మాయిలతో తిరిగేవాడని.. తనను కొట్టేవాడని గతంలో ఆరోపణలు చేసింది. భార్య ఆరోపణలతో.. పవిత్ర వ్యవహారం అప్పట్లో వైరల్ అయింది. దీంతో అతనికి అవకాశాలు కూడా తగ్గాయని తెలుస్తోంది. దీంతో మందుకు బాగా బానిస అయ్యాడని.. ఎప్పుడూ డిప్రెషన్‌లో కనిపించేవాడని.. ఆ అలవాట్లు, బాధలతో పవిత్రనాథ్‌కు ఆరోగ్య సమస్యలు వచ్చాయా… అవే ప్రాణం తీశాయా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.