ప్రాణాపాయ స్థితిలో సునితా విలియమ్స్‌ ?

ఇంటర్నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌లో చిక్కుకున్న సునితా విలియమ్స్‌టీం ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. స్పేస్‌కు వెళ్లే సమయంలో ఎంతో హెల్దీగా ఉన్న టీం మొత్తం ఇప్పుడు చాలా బలహీనంగా తయారయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 13, 2024 | 07:35 PMLast Updated on: Nov 13, 2024 | 7:35 PM

Is Sunita Williams In Critical Condition

ఇంటర్నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌లో చిక్కుకున్న సునితా విలియమ్స్‌టీం ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. స్పేస్‌కు వెళ్లే సమయంలో ఎంతో హెల్దీగా ఉన్న టీం మొత్తం ఇప్పుడు చాలా బలహీనంగా తయారయ్యారు. శరీరాలు పీక్కుపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు కనబడుతున్నారు. ప్రస్తుతం వీళ్ల ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవ్వడంతో సునీతా టీం ఆరోగ్య పరిస్థితిపై నాసా అప్‌డేట్‌ ఇచ్చింది. ఆస్ట్రోనాట్స్‌ ఆరోగ్యం కొంత క్షీణించిన విషయం వాస్తవమేనని చెప్పింది. కానీ ఎవరూ ప్రణాపాయ స్థితిలో మాత్రం లేని క్లారిటీ ఇచ్చింది. నిజానికి సునితా విలియమ్స్‌ టీం ఐఎస్‌ఎస్‌కు వెళ్లింది కేవలం 8 రోజులు పరిశోధనలు చేయడానికి మాత్రమే. కానీ ప్రొపల్షన్‌లో లోపం కారణంగా వాళ్లు అక్కడే చిక్కుకున్నారు.

వేరే రాకెట్‌లో వాళ్లను భూమి మీదకు తీసుకురావాల్సి ఉంది. దానికి కూడా దాదాపు 6 నెలలు పట్టే అవకాశం ఉండటంతో వాళ్లు అంతరిక్షంలోనే చిక్కుకున్నారు. 6 నెలలకు సరిపోయే ఆహారం సునితా టీం దగ్గర లేదు. దీంతో వాళ్లు సరైన పౌష్టికాహారం లేక బక్కచిక్కిపోతున్నారు. దీంతో పాటు స్పేస్‌లో గ్రావిటీ ఉండదు కాబట్టి వాళ్ల మీద ఆ భారం ఎక్కువగా పడే ప్రమాదం ఉంది. కండరాలు, ఎముకలు క్షీణించే అవకాశం ఉన్నట్టు ముందు నుంచీ డాక్టర్లు చెప్తూనే ఉన్నారు. దీనికి తోడు ఆహారం కూడా లేకపోవడం వాళ్ల మీద మరింత ఎక్కువ ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇప్పటికే వాళ్ల ఆరోగ్యం చాలా వరకూ చెడిపోయింది. 2025 ఫిబ్రవరిలో స్పేస్‌ఎక్స్‌ నుంచి రాకెట్‌ వెళ్లనుంది దాంట్లోనే సునితా టీం భూమి మీదకు తిరిగి రానున్నారు. అప్పటి వరకూ వాళ్ల ఆరోగ్యం ఎలా ఉంటుంది.. అసలు ప్రాణాలతో ఉంటారా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.