బుమ్రా లేకుంటే ఇక అంతేనా ? గాయంపై టెన్షన్ వద్దన్న మోర్కెల్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. అడిలైడ్ వేదికగా జరిగిన ఈ టెస్టు మ్యాచ్ కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 9, 2024 | 08:59 PMLast Updated on: Dec 09, 2024 | 8:59 PM

Is That All That Matters Without Bumrah Morkel Not Worried About Injury

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. అడిలైడ్ వేదికగా జరిగిన ఈ టెస్టు మ్యాచ్ కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన పేరిట 4 వికెట్లు తీశాడు. అయితే మ్యాచ్ సమయంలో బుమ్రా తొడ కండరాల నొప్పితో బాధపడ్డాడు. బౌలింగ్ చేస్తూ కిందపడిపోవడంతో ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. అనంతరం బుమ్రా మళ్ళీ బౌలింగ్ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో బుమ్రా సిరీస్‌లోని అన్ని టెస్టు మ్యాచ్‌లు ఆడతాడా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నిజానికి బిజిటిలో బుమ్రా బౌలింగ్ బాధ్యత పూర్తిగా తానే తీసుకున్నాడు. మిగతా బౌలర్లు వికెట్లు తీసినా కీలక వికెట్లు తీయడంలో బుమ్రాదే పైచేయి.పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో జెస్సి 8 వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్ లో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అడిలైడ్‌లోనూ అదే జోరును కొనసాగించాడు. ఇప్పటి వరకు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. అతను 2 మ్యాచ్‌ల్లో 11.25 సగటుతో 12 వికెట్లు తీశాడు. ఈ ఏడాది ఇప్పటివరకు టెస్టుల్లో బుమ్రా 50కి పైగా వికెట్లు పడగొట్టాడు. అయితే బుమ్రా గాయం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు బుమ్రాకు ఎలాంటి గాయం కాలేదని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ అప్డేట్ ఇచ్చాడు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగతా మూడు మ్యాచ్ లు టీమిండియాకు కీలకం. ఈ నేపథ్యంలో బుమ్రా ఆటకు దూరమైతే బౌలింగ్ దళం పూర్తిగా వీకైపోతుందంటూ ఆందోళన చెందుతున్నారు.

సునీల్ గవాస్కర్ కూడా బుమ్రా మిగతా అన్ని మ్యాచ్ లు ఆడాలని కోరుకుంటున్నాని చెప్పాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో బుమ్రా ఇప్పటివరకు అద్భుతంగ బౌలింగ్ చేశాడన్నాడు గవాస్కర్. ఈ పరిస్థితుల్లో అతను సిరీస్ మొత్తం బౌలింగ్ చేయాలనీ ఆకాంక్షించారు. ఒకవేళ బుమ్రాకు ఏదైనా సమస్య ఉంటే అతనికి ఇంకా 4 రోజుల సమయం ఉంది. సో బుమ్రా మూడో టెస్టుకు అందుబాటులోకి రావొచ్చని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.మరోవైపు బుమ్రా మూడో టెస్టులో ఆడకపోతే పరిస్థితి ఏంటన్నది ఆందోళనకరంగా మారింది.