Bollywood : అ మాజీ సిఎం మనవళ్ళు హీరోయిన్లకు అంత నచ్చేస్తున్నారా…?
సినిమాలు (movies) హిట్ అయినా ఫ్లాప్ అయినా హీరోయిన్లు మాత్రం ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. బాలీవుడ్ (bollywood) హీరోయిన్లు అయితే ప్రేమ వ్యవహారాలతో ఎక్కువగా చర్చల్లో నిలుస్తూ ఉంటారు.
సినిమాలు (movies) హిట్ అయినా ఫ్లాప్ అయినా హీరోయిన్లు మాత్రం ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. బాలీవుడ్ (bollywood) హీరోయిన్లు అయితే ప్రేమ వ్యవహారాలతో ఎక్కువగా చర్చల్లో నిలుస్తూ ఉంటారు. ఒకవైపు సినిమాలు లేకపోయినా సరే మరోవైపు ప్రేమ వ్యవహారాలతో వాళ్ళు మీడియాలో చర్చలకు వేదిక అవుతూ ఉంటారు. స్టార్ క్రికెటర్ లు, రాజకీయ నాయకులు, స్టార్ హీరోలతో హీరోయిన్లు ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా నడుపుతూ ఉంటారు. అలా వివాహాలు చేసుకున్న హీరోయిన్లు సైతం ఉన్నారనే విషయం తెలిసిందే.
ఇప్పుడు ఒక హీరోయిన్ ఇదే బాటలో ఉంది. సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆమె కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందనుకున్న తరుణంలో ఒక మాజీ సీయం మనువడితో ప్రేమలో పడి వార్తల్లో నిలిచింది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా…? మాజీ విశ్వ సుందరి మానుషి చిల్లర్. ఆమె నటించిన రెండు మూడు సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ సమయంలో ఆమె మహారాష్ట్ర (Maharashtra) మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ షిండే (Sushil Kumar Shinde) మనవడు వీర్ పహారియాతో ప్రేమలో పడి… అవసరమైతే పెళ్లి వరకు వెళ్ళడానికి సిద్దంగా ఉందట.
ఇప్పుడు ఈ ఇద్దరూ ముంబై వీధుల్లో తెగ తిరిగేస్తున్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వీర్ తండ్రి కూడా వీళ్ళ ప్రేమకు అంగీకారం తెలిపారని సమాచారం. అవసరమైతే వచ్చే ఏడాది వీళ్ళు వివాహం కూడా చేసుకోవచ్చని అంటున్నారు. సినిమాల మీద ఆసక్తి లేకపోతే వ్యాపారాల మీద దృష్టి పెట్టాలని, తన వ్యాపారాలను చూసుకోవచ్చని కూడా వీర్ ఆఫర్ ఇచ్చాడట. దీనితో ఆమె కూడా ఇప్పుడు నటించే ఒకటి రెండు సినిమాలు హిట్ అయితేనే సినిమాలు చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. వీర్ కూడా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటీ అంటే… జాన్వీ కపూర్ (Jhanvi Kapoor) … వీర్ సోదరుడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉంది. ఇద్దరూ ప్రేమించిన వారినే వివాహం చేసుకుంటే మాత్రం తోటి కోడళ్ళు అయినట్టే.