ఆ ట్వీట్ కు అర్థం అదేనా ? విడాకుల బాటలో చాహల్
సెలబ్రిటీల పర్సనల్ లైఫ్స్ లో విడాకులు సర్వసాధారణంగా మారిపోయాయి. సినిమా, పొలిటికల్ సెలబ్రిటీలే కాదు క్రికెటర్లు సైతం విడాకుల విషయంలో ఏమాత్రం ఆలోచించడం లేదు.
సెలబ్రిటీల పర్సనల్ లైఫ్స్ లో విడాకులు సర్వసాధారణంగా మారిపోయాయి. సినిమా, పొలిటికల్ సెలబ్రిటీలే కాదు క్రికెటర్లు సైతం విడాకుల విషయంలో ఏమాత్రం ఆలోచించడం లేదు. చాలా ఈజీగా బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. ఈ ఏడాది హార్థిక్ పాండ్యా విడాకుల ఎపిసోడ్ దీనికి ఉదాహరణ.. ఇప్పుడు హార్థిక్ బాటలోనే మరో స్టార్ క్రికెటర్ నడవబోతున్నాడు. యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ విడిపోతున్నారన్న వార్తలు షికారు చేస్తున్నాయి. ఒకప్పుడు తమ బ్యూటిఫుల్, క్యూట్ లవ్ స్టోరీతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న ఈ జంట, త్వరలో విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
చాహల్, ధనశ్రీ 2020లో పెళ్ళి చేసుకున్నారు. ఏ ఫంక్షన్ అయినా, క్రికెట్ మ్యాచ్ లోనైనా వీరి సందడి మామూలుగా ఉండేది కాదు. ధనశ్రీ ఒక పాపులర్ డ్యాన్సర్, మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. తన అందం, టాలెంట్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఒకప్పుడు చాహల్, ధనశ్రీ ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేసేవి. కానీ, ఈ మధ్యకాలంలో వీరిద్దరూ కలిసి కనిపించడం చాలా అరుదుగా మారింది. అంతేకాదు, సోషల్ మీడియాలో కూడా ఒకరి ఫొటోలు మరొకరు షేర్ చేసుకోవడం ఆపేశారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని, అందుకే విడాకుల పుకార్లు వస్తున్నాయని నెటిజన్లు తేల్చేస్తున్నారు
చాహల్ గత కొంతకాలంగా సోషల్ మీడియా అకౌంట్స్‌లో పెడుతున్న పోస్టులు కూడా అనుమానాలకు తావిస్తున్నాయి. సాధారణంగా జాలీగా ఉండే చాహల్ ఈ మధ్య కొంచెం ఎమోషనల్ తో కూడిన పోస్టులు పెడుతున్నాడు. దీంతో అతడి పర్సనల్ లైఫ్‌లో ఏదో జరుగుతోందంటూ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఒక ముగింపు ఒక కొత్త ప్రారంభం అంటూ శివుడి ఫొటోను షేర్ చేయడం అనేక అనుమానాలకు తావిచ్చింది. అంటే వారి బంధానికి ముగింపు పలికి, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాడా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ స్టార్ కపుల్ డివోర్స్ తీసుకుంటున్నారని బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ సోషల్ మీడియాలో ఓపెన్‌గా ప్రకటించాడు. కానీ, చాహల్ , ధనశ్రీ ఈ కామెంట్స్‌పై ఇంకా స్పందించలేదు. ధనశ్రీకి బాలీవుడ్, సోషల్ మీడియాపై ఉన్న ఆసక్తి తనపై లేదని చాహల్ గొడవపడినట్టు పుకార్లు వస్తున్నాయి. ఈ కారణంగానే ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని సోషల్ మీడియాలో టాక్. కాగా వీరిద్దరూ గత కొన్నిరోజులుగా ఎక్కడా కలిసి కనిపించకపోవడం కూడా ఈ టాక్ కు బలాన్ని చేకూరుస్తోంది.