Telangana BJP Tickets: బీజేపీ ఎంపీ లిస్ట్ రెడీ… వాళ్ళ పేర్లు ఉంటాయా ?
లోక్‌సభ అభ్యర్థుల (Lok Sabha Elections)ఎంపిక కోసం ముమ్మర కసరత్తు చేస్తోంది తెలంగాణ బీజేపీ. షెడ్యూల్ విడుదలకన్నా ముందే అభ్యర్థులను ప్రకటించాలన్న టార్గెట్‌తో ఉంది అధినాయకత్వం. తెలంగాణలో ఈసారి డబుల్ డిజిట్ కొట్టి తీరాలన్న కసితో ఉన్న కమల నాథులు ఆ క్రమంలో ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది. ఢిల్లీలో భేటీ అయిన తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ... మొత్తం 17 స్థానాల అభ్యర్థుల గురించి చర్చించినట్టు తెలిసింది.
లోక్‌సభ అభ్యర్థుల (Lok Sabha Elections)ఎంపిక కోసం ముమ్మర కసరత్తు చేస్తోంది తెలంగాణ బీజేపీ. షెడ్యూల్ విడుదలకన్నా ముందే అభ్యర్థులను ప్రకటించాలన్న టార్గెట్‌తో ఉంది అధినాయకత్వం. తెలంగాణలో ఈసారి డబుల్ డిజిట్ కొట్టి తీరాలన్న కసితో ఉన్న కమల నాథులు ఆ క్రమంలో ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది. ఢిల్లీలో భేటీ అయిన తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ… మొత్తం 17 స్థానాల అభ్యర్థుల గురించి చర్చించినట్టు తెలిసింది. ఎవరెవరు పోటీకి సిద్ధంగా ఉన్నారు… సర్వే రిపోర్ట్ లు ఎలా ఉన్నాయని సమీక్షించి ఏకాభిప్రాయం ఉన్న నియోజకవర్గాల్లో పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించాలని నిర్ణయించారట. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రాష్ట్ర పార్టీ నుండి పార్టీ నేతల నుండి అభిప్రాయ సేకరణ చేశాయట స్పెషల్ టీమ్స్. ఆ నివేదికల గురించి కూడా రాష్ట్ర ఎన్నికల కమిటీ చర్చించినట్టు తెలిసింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం… మూడు సిట్టింగ్ స్థానాల అభ్యర్థుల పేర్లను ఫస్ట్ లిస్టులోనే ప్రకటించవచ్చు.
సికింద్రాబాద్ (Secunderabad) నుంచి కిషన్ రెడ్డి (Kishan Reddy), నిజమాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) , కరీంనగర్ నుంచి బండి సంజయ్ (Bandi Sanjay) ల పేర్లు మొదటి జాబితాలో ఉండవచ్చు. అలాగే చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరిలో బూర నర్సయ్య , మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ పేర్లు ఫైనల్ కావచ్చంటున్నారు. హైదరాబాద్ నుంచి మాధవీలత పేరు వినిపిస్తున్నా… స్థానిక నేతలు అభ్యంతరం పెడుతున్నట్టు తెలిసింది. పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్, మహబూబాబాద్, నల్గొండ , ఖమ్మం, జహీరాబాద్ నియోజక వర్గాలలో ఇతర పార్టీల నుండి వచ్చేవారు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా చర్చ జరిగినట్టు తెలిసింది. ఆయా నియోజకవర్గాల్లో పలువురి పేర్లు ప్రస్తావనకు వచ్చాయని, సీట్ కన్ఫర్మ్ చేస్తే పార్టీలోకి వస్తామని సదరు నేతలు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక మహబూబాబాద్ సీటు కోసం ఒక BRS నేత, ఒక కాంగ్రెస్ బడా నేత టచ్ లో బీజేపీ పెద్దలకు టచ్‌లో ఉన్నారట. వాళ్ళిద్దరిలో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని, అందులో కూడా కాంగ్రెస్ నేతకే ఎక్కువ ఛాన్స్ ఉందన్నది బీజేపీ వర్గాల సమాచారం.
ఇక వరంగల్‌లో మాజీ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్ ముందు వరసలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఒక BRS మాజీ ఎమ్మెల్యే పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. నాగర్ కర్నూల్ ఎంపీ రాములు బీజేపీలో చేరే అవకాశం ఉందని, అయితే అయనకు, కుదరకుంటే ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వొచ్చంటున్నారు. జహీరాబాద్ విషయంలోనూ సిట్టింగ్ ఎంపీ టచ్ లో ఉన్నారనే చర్చ జరుగుతోంది.
మహబూబ్ నగర్ నుంచి డికే అరుణ (DK Aruna) పేరు ముందు వరసలో ఉంది.. అయితే జితేందర్ రెడ్డి , శాంతి కుమార్ కూడా ఆ స్థానం కోసం గట్టిగా పట్టు పడుతున్నారట. మరోవైపు మల్కాజ్ గిరి పై బడా నేతలు కన్నేశారు… ఈటల రాజేందర్ (Etala Rajender) ఈ స్థానం కోసం పట్టు పడుతున్నారట. ఆయనతో పాటు మరి కొందరు కూడా లాబీయింగ్ చేసుకుంటున్నారు. చాడ సురేష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ మల్కాజ్‌గిరి కోసం ఢిల్లీలో మకాం వేసినట్టు తెలిసింది. జిల్లా అధ్యకుడు హరీష్ రెడ్డి కూడా లాబీయింగ్ చేసుకుంటున్నారు. మల్కాజ్ గిరిపై క్లారిటీ వస్తే… దానికి అనుబంధంగా మెదక్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు బీజేపీ నేతలు. నల్గొండ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి గురించి మీటింగ్ లో చర్చ జరిగిందట… BRS రెబెల్ గా పోటీ చేసిన అయన బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్టు సమాచారం… ఖమ్మం టిక్కెట్‌ను ఇటీవల పార్టీలో చేరిన నాయకుడు ఆశిస్తున్నారట…
గత ఎన్నికల్లో పోటీ చేసిన దేవకీ వాసుదేవరావు, ఈవీ రమేష్ గౌడ్ కూడా టికెట్ ఆశిస్తున్నారట. అదిలాబాద్‌లో సిట్టింగ్ ఎంపీపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్నందున కొత్తవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని సమావేశంలో చర్చ జరిగిందట. మాజీ ఎంపీని పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తమైనట్టు ప్రచారం జరుగుతోంది. మూడు నాలుగు రోజుల్లోనే అభ్యర్థుల సంగతి తేల్చేయాలని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ కృత నిశ్చయంతో ఉన్నట్టు సమాచారం… పార్టీ నేషనల్ కౌన్సిల్ సమావేశాల్లోపే తెలంగాణ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ అని అనుకుంటున్నా… కుదిరితే మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించే ఆలోచనలో బీజేపీ కేంద్ర పెద్దలు ఉన్నట్టు తెలిసింది. చివరికి లిస్ట్ లో ఎవరెవరి పేర్లు ఉంటాయో చూడాలి.