Congress: టికెట్ల కేటాయింపులో కొత్త రూటు.. కాంగ్రెస్ స్ట్రాటజీ మాములుగా లేదుగా..
కర్ణాటక ఎన్నికల్లో అనుసరించిన స్ట్రాటజీనే తెలంగాణలోనూ అమలు చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే 115 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ప్రయత్నాలు వేగవంతం చేసింది.
తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెచ్చిన పార్టీగా.. క్రెడిట్ సాధించడంలో కాంగ్రెస్ ఘోరంగా ఫెయిల్ అయింది. వరుసగా రెండుసార్లు అధికారానికి దూరం అయింది. ఐతే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం రావాలనే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్.. దానికి తగినట్లే ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటూ వెళ్తోంది. కర్ణాటక ఎన్నికల్లో అనుసరించిన స్ట్రాటజీనే తెలంగాణలోనూ అమలు చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే 115 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ప్రయత్నాలు వేగవంతం చేసింది.
ఐతే అభ్యర్థులకు సంబంధించి కూడా కర్నాటక ఫార్ములానే ఫాలో కావాలని హస్తం పార్టీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా.. టికెట్లు కేటాయింపు వ్యవహారాన్ని పగడ్బందీగా నిర్వహిస్తోంది. ఎలాంటి మొహమాటలకు వెళ్లకుండా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయిపోయింది. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా చూసుకుంటోంది. గెలిచే వారికే టికెట్ అని క్లియర్‌కట్‌గా చెప్పేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. గతంలో ఫాలో అయినట్లు.. టిక్కెట్ల కేటాయింపులో సీనియారిటీ, సిఫార్సులను పక్కన పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరఫున రకరకాల సర్వేలు నిర్వహించారు. సునీల్ కనుగోలు ఇప్పటికే ఓ సర్వే చేసి.. నివేదిక సమర్పించారు.
అటు రాహుల్ గాంధీ టీమ్ కూడా తెలంగాణలో ఓ సర్వే చేపట్టింది. ఇలా రకరకాల సర్వేల్లో కచ్చితంగా గెలుస్తారు అనుకున్న వారికే టిక్కెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. ఐతే అధిష్టానం ఇలాంటి నిర్ణయంతో.. సీనియర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్. తమకు టికెట్ వస్తుందా రాదా అనే టెన్షన్ వారిలో కనిపిస్తోంది. ఇక అటు ఇప్పటికే రెండుసార్లు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది. ఐతే గతంలో చేసిన సర్వేలపై స్క్రీనింగ్ కమిటీలో పలువురు అనేక అనుమానాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఐతే నాయకుల విని టిక్కెట్లు కేటాయించే విధానానికి కాంగ్రెస్ పూర్తిగా స్వస్తి పలికింది. ఇక అటు గెలుపుపై అనుమానం ఉన్న చోట ఏఐసీసీ.. మరోసారి ఫ్లాష్ సర్వేలు చేస్తున్నట్లు సమాచారం. ఫ్లాష్ సర్వేలు చేసేందుకు మూడు బృందాలను రంగంలోకి దించారు.
కాంగ్రెస్ గతంలో ప్రతీ నియోజకవర్గంలో 5వందల లోపు మాత్రమే నమూనాలు సేకరించేది. అయితే కాంగ్రెస్ సర్వే బృందాలు ప్రస్తుతం మూడు వేల వరకు శాంపిల్స్ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితి ఏమిటనేది ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారట. ఇవన్నీ పూర్తిగా అధ్యయనం చేసి అప్పుడే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని… ఈ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయిందని తెలుస్తోంది.