BRS VILEENAM : కాంగ్రెస్ లో బీఆర్ఎస్.. విలీనం తప్పదా?

తెలంగాణ కాంగ్రెస్ (Telangana, Congress) లో బీఆర్ఎస్ (BRS) పార్టీ విలీనం (Party Merger) తప్పదా? ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ అడుగులేస్తున్నట్లుగా కనిపిస్తోంది. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న BRS నుంచి 26 మంది ఎమ్మెల్యేలు చీలిపోయి కాంగ్రెస్ లో చేరితే BRSLP అధికారికంగా కాంగ్రెస్ లో విలీనం అయినట్లే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 18, 2024 | 09:45 AMLast Updated on: Mar 18, 2024 | 10:55 AM

Is The Merger Of Brs In Congress A Must

తెలంగాణ కాంగ్రెస్ (Telangana, Congress) లో బీఆర్ఎస్ (BRS) పార్టీ విలీనం (Party Merger) తప్పదా? ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ అడుగులేస్తున్నట్లుగా కనిపిస్తోంది. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న BRS నుంచి 26 మంది ఎమ్మెల్యేలు చీలిపోయి కాంగ్రెస్ లో చేరితే BRSLP అధికారికంగా కాంగ్రెస్ లో విలీనం అయినట్లే. ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్ చేరడంతో, మరో 25 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి లాగి… BRSLPని కాంగ్రెస్ లో విలీనం చేసుకునే ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ (Congress) నేతలు. గతంలో KCR ఇదే మోడల్ లో కాంగ్రెస్ నాయకుల్ని TRSలోకి లాగాడు. ఇప్పుడు సేమ్ మోడల్ లో BRSని దెబ్బ కొట్టే వ్యూహంలో ఉంది కాంగ్రెస్.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేరికలకు గేట్లు ఓపెన్ చేసింది. 100 రోజుల పాలన పూర్తి కావడంతో ఇక తగ్గేది లేదంటూ దూకుడు పెంచారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఇవాళ్టీ నుంచి తన రాజకీయం చూపిస్తానన్న ఆయన… ఇద్దరు కీలక నేతలను పార్టీలోకి చేర్చుకుని చేతల్లో చూపించారు. మీరు పడగొడితే నేను నిలబెడతా అంటూ.. ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకునే పనిలో పడ్డారు.
అన్నట్లుగానే చేరికలకు కాంగ్రెస్ గేట్లు తెరిచింది. లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆపరేషన్‌ ఆకర్ష పై కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పీడ్‌ పెంచింది. బీఆర్‌ఎస్‌కు చెందిన కీలక నేతలను ఒక్కొక్కరిగా పార్టీలో చేర్చుకుంటోంది. అధికారంలోకి వంద రోజులు అయినందున… ఇక పార్టీ అధ్యక్షుడిగా ఫస్ట్‌ గేటు ఓపెన్‌ చేశానన్నారు రేవంత్‌ రెడ్డి. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకుంటానా అని సవాల్ చేశారు. రేవంత్‌ వ్యాఖ్యల తర్వాత ఇద్దరు కీలక నేతలు గులాబీకి గుడ్‌బై చెప్పి హస్తం పార్టీతో చేతులు కలిపారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సీఎం ఆధ్వర్యంలో… ఇంచార్జ్ దీపా దాస్‌మున్షీ సమక్షంలో పార్టీలో చేరారు. చేవెళ్ల పార్లమెంట్ నుంచి రంజిత్ రెడ్డిని బరిలోకి దింపనుంది కాంగ్రెస్. సికింద్రాబాద్ నుంచి దానంను పోటీకి పెట్టాలని పార్టీ నిర్ణయించించినట్లు సమాచారం. మల్కాజ్ గిరి నుంచి.. సునీతా మహేందర్ రెడ్డిని దింపే అవకాశం ఉంది. పార్టీ సర్వే ఆధారంగా టికెట్ల ప్రకటన ఉండబోతుంది.

వచ్చే రెండు రోజుల్లో మరో నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది. గతంలో సీఎం రేవంత్‌ను BRS ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి కలిశారు. వీళ్ళల్లో ఎవరు చేరతారనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ మొదట్లో భావించింది. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బొటాబొటీ మెజార్టీ ఉండటం… పైగా ఎక్కువ రోజులు ఈ సర్కార్‌ ఉండదని విపక్షాలు ప్రచారం ముమ్మరం చేయడంతో.. రేవంత్‌ సీరియస్‌గా తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ముఖ్యమంత్రి తన వ్యూహాన్ని మార్చేశారు. ఈ క్రమంలో ప్రతిపక్షం ఖాళీ అయ్యేవరకు ఈ గేట్లు తెరిచే ఉంటాయంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌ మరింత చర్చకు దారితీశాయి.