Pawan Kalyan: పవన్‌ను వైసీపీ టార్గెట్ చేయబోతోందా.. నెక్ట్స్ అరెస్ట్ జనసేనానిదేనా ?
చంద్రబాబు తరువాత పవన్ కళ్యాణ్ అరెస్ట్ కాబోతున్నారా.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ జరిగిందని.. ఆయనను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసారు. ఈ అరెస్ట్‌ను వైసీపీ నేతలు, మంత్రులు స్వాగతిస్తుండగా.. ప్రధాన ప్రతిపక్షాలు జనసేన, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ఖండించాయ్. ఇదంతా ఎలా ఉన్నా.. చంద్రబాబు అరెస్ట్ ఏపీ రాజకీయాలు కీలక మలుపు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో లోకేశ్ పాత్ర కూడా ఉందని సీఐడీ అధికారులు అంటున్నారు. దీంతో ఈ వ్యవహారంలో లోకేశ్ అరెస్ట్ తప్పదా అనే చర్చ జరుగుతుండగా.. మరో కీలక అంశం ఒకటి తెరమీదకు వస్తోంది. అదే పవన్ కల్యాణ్‌ను అరెస్ట్ చేయడం. టీడీపీ, జనసేనను వైసీపీ కావాలని టార్గెట్ చేస్తోందని.. చంద్రబాబు అరెస్ట్ అందులో భాగమేనని.. ఈ లెక్కన పవన్ అరెస్ట్ కూడా ఖాయం అంటూ కొత్త ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియాలో ! వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపించి.. సేనాని అరెస్ట్ చేయడం ఖాయం అంటూ మరికొందరు జోస్యం చెప్తున్నరు.
వారాహి యాత్రలో భాగంగా వాలంటీర్ల మీద పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల కారణంగా మహిళలు పెద్ద ఎత్తున మాయం అవుతున్నారని.. కేంద్రం నుంచి తనకు నివేదిక కూడా అందింది అన్నారు. వాలంటీర్లు మహిళల డేటా సేకరిస్తున్నారని.. ఈ లెక్కలన్నీ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఏజెన్సీకి చేరుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఆ సమయంలో పవన్‌పై వాలంటీర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పవన్ ఫొటోలు, ఫ్లెక్సీలు, దిష్టిబొమ్మలను దహనం చేశారు. గ్రామ, వార్డు వాలంటీర్లతో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లలో పవన్ మీద వైసీపీ నేతలు ఫిర్యాదులు చేయించారు. కట్ చేస్తే ఇదే ఇప్పుడు పవన్ అరెస్ట్‌కు కారణం అవుతుందా అంటే.. చాన్స్ ఉంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. పవన్‌పై కేసును విజయవాడలోని ఒక కోర్టు విచారణకు స్వీకరించింది. ఆయనకు నోటీసులు జారీ చేసింది.
ఒక వాలంటీర్ దాఖలు చేసిన కేసులో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో పవన్ అరెస్ట్ చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అటు చంద్రబాబు, ఇటు పవన్‌ను వైసీపీ ఎందుకు టార్గెట్ చేస్తుందంటే.. దీని వెనక ఉంది రాజకీయమే ! రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఏర్పాటు కాకుండా వైసీపీ చేయని ప్రయత్నం లేదు. అన్ని రకాల వ్యూహాలు అమలు చేసింది. ఐతే ఏదీ సక్సెస్ కాలేదు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయం అయింది. అదే జరిగితే 2014 ఎన్నికల్లో ఫలితాలు రిపీట్ అయ్యే చాన్స్ ఉందని వైసీపీ టెన్షన్ పడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. అందుకే రెండు పార్టీలను కావాలని టార్గెట్ చేస్తుందనే చర్చ జరుగుతోంది. ఇక చంద్రబాబు జిల్లాల పర్యటనకు, లోకేశ్ యువగళానికి, పవన్ వారాహి యాత్రలకు వస్తున్న రెస్పాన్స్ కారణంగా.. ఈ రెండు పార్టీలు బలపడకూడదని నేతలను కోర్టుల చుట్టూ తిప్పాలని.. కావాలనే వైసీపీ ఇలా అరెస్ట్‌లు చేయిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయ్.. టీడీపీ, జనసేన నుంచి !