SWAROOPA : దొంగ స్వామీజీకి ఇంత సెక్యూరిటీనా.. జగన్ అరాచకానికి చంద్రబాబు చెక్..
ధ్యానం చేయడం, దీవించడం.. ఇంతకుమించి ఏముంటుంది స్వామీజీల పని. అందరినీ ఒకేలా చూసే వారికి.. శత్రువులు ఉంటారా... అసలు వాళ్లకు సెక్యూరిటీ అవసరమా..
ధ్యానం చేయడం, దీవించడం.. ఇంతకుమించి ఏముంటుంది స్వామీజీల పని. అందరినీ ఒకేలా చూసే వారికి.. శత్రువులు ఉంటారా… అసలు వాళ్లకు సెక్యూరిటీ అవసరమా. మరి కట్టుదిట్టమైన భద్రత పెట్టారంటే.. మ్యాటర్ తేడా అన్నట్లే కదా ! అదే చర్చ జరుగుతోంది స్వరూపానంద విషయంలో ! ఈ దొంగ స్వామీజీకి పది మంది పోలీసులతో 24గంటల భద్రత ఏర్పాటు చేశారు అప్పటి సీఎం జగన్. జనం సొమ్ముతో మరీ ఇంత అరాచకమా.. అసలు స్వరూపానంద స్వామికి ఎవరి వల్ల ప్రమాదం ఉంది.. అసలు ఆయన స్వామీజీయేనా.. చంద్రబాబుతో నిర్ణయంతో జరుగుతున్న చర్చ ఏంటి..
స్వామీజీలు అంటే ధ్యానంలో ఉండాలి.. భక్తుల సమస్యలకు ఓ మార్గం చూపించారు. మరీ భక్తి ఎక్కువయితే దీవించి.. కాస్త ఓదార్పు ఇవ్వాలి. మఠాల పేరుతో, ధార్మిక సంస్థల పేరుతో రాజకీయాల్లో వేలు పెడితే.. రాజకీయాల గురించి మాట్లాడితే.. దొంగ స్వామీజీనే అంటారు మరి ! ఇలాంటి చర్చ వచ్చిన ప్రతీసారి విశాఖ శారదాపీఠం స్వరూపానంద సరస్వతి పేరు వినిపిస్తూనే ఉంటుంది. తెలంగాణలో కేసీఆర్… ఏపీలో జగన్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు.. దైవస్వరూపంగా మారిపోయారు స్వరూపానంద. స్వామీజీ కూడా తక్కువేం కాదు.. అవకాశం చిక్కినప్పుడల్లా ఇద్దరు ముఖ్యమంత్రుల పనితీరుపై ప్రశంసలు గుప్పించారు. తెలుగు రాష్ట్రాలు స్నేహభావంతో దూసుకుపోతున్నాయని ఊదరగొడుతూ.. ఇద్దరికీ అంతో ఇంతో రాజకీయంగా మైలేజ్ ఇచ్చారు. కట్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో సీన్ మారిపోయింది. అక్కడ జగన్, ఇక్కడ కేసీఆర్.. ఓడిపోయారు. ఇలా సీన్ రివర్స్ అయిందో లేదో.. స్వరూపానంద ప్లేట్ తిప్పేశారు. చంద్రబాబు తోపు, తురుం అన్నట్లు ప్రశంసలు గుప్పించారు. అక్కడితో ఆగారా అంటే.. ఓ నోటితో జగన్ మీద ప్రశంసలు గుప్పించారో.. ముద్దులు పెట్టారో.. అదే నోటితో తిట్లు తిట్టారు. సామాన్యులు ఇలా ప్లేట్ ఫిరాయిస్తే ఏదో అనుకోవచ్చు.. స్వామీజీ అని చెప్పుకునే మీరు కూడా ఇలా ప్లేట్ తిప్పేస్తే ఎలా అంటూ.. జనాలు ఛీ కొట్టడం మొదలుపెట్టారు.
ఇదంతా ఎలా ఉన్నా.. స్వరూపానంద స్వామీజీకి చంద్రబాబు సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. స్వరూపానంద భద్రతను భారీగా కుదించింది. పర్సనల్ సెక్యూరిటీ కోస ఒక్క పోలీసు మినహా.. మిగతా అందరినీ ప్రభుత్వం తొలగించింది. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామికి… పూర్తిగా సెక్యూరిటీ తీసేసింది. జగన్ ప్రభుత్వంలో స్వరూపానందకు 2+2 గన్‌మెన్.. ఎస్కార్ట్ వాహనంతో పాటు 15మందికి పైగా సిబ్బంది భద్రతా విధుల్లో ఉండేవారు. స్వరూపానంద బయటకు వస్తే.. ఎస్కార్ట్ వెహికల్ ద్వారా ట్రాఫిక్ కంట్రోల్ చేసేవారు. ఒక్క స్వామీజీకి ఇంత సెక్యూరిటీనా.. జగన్‌ది మరీ ఇంత అరాచకమా అని ఇప్పుడు చర్చ మొదలైంది. ఒక్క స్వామీజీ కోసం.. 15మందికి పైగా పోలీసులా.. జనం సొమ్ముతో దొంగ స్వామికి భద్రతా కల్పించాల్సిన అవసరం ఏమొచ్చింది. అధికారం అప్పగించారు కదా అని ఇన్ని అరాచకాలా జగన్ అంటూ ఇప్పుడు ప్రతీ ఒక్కరు నిలదీస్తున్నారు. నిజానికి హిందుత్వ పార్టీ అని చెప్పుకునే బీజేపీ కూడా.. ఎప్పుడూ ఏ స్వామీజీ కోసం ఇంతలా భద్రత ఏర్పాట్లు చేయలేదు. మోదీ, షాలాంటి వాళ్లు.. మహా అయితే దీవెనలు తీసుకున్నారేమో కానీ.. ఇలా జనాల సొమ్మును అప్పనంగా భద్రత రూపంలో ఖర్చు చేయలేదు. జగన్ మాత్రం.. మోనార్క్ లెవల్‌లో 15మంది పోలీసులను.. స్వామీజీ సేవలో పెట్టారు అంటే.. అర్థం చేసుకోవచ్చు.. అరాచకం ఏ స్థాయిలో జరిగింది అని ! ప్రభుత్వ యంత్రాంగాన్ని, అధికారులను.. స్వామీజీల కోసం దాసోహం చేసే దరిద్రం.. దరిద్రపు నిర్ణయం బహుశా జగన్ సర్కార్‌కే చెల్లిందేనే చర్చ జరుగుతోంది.
ఇక అటు అసలు స్వరూపానందకు ఇంత భద్రత కల్పించాల్సిన అవసరం ఏమొచ్చిందనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయ్. స్వరూపానందకి ఎవరి నుంచి ప్రమాదం ఉంది.. దీవించడం, ధ్యానం చేయడం, భక్తుల సమస్యలకు తమకు తోచిన పరిష్కారం చూపడం. ఇదే కదా నిజమైన స్వామీజీలు చేసేది. దైవచింతన తప్ప.. ప్రాణాల మీద కూడా పెద్దగా ఆశలు పెట్టుకోరు కదా స్వామీజీలు.. అలాంటిది 15మందితో స్వరూపానందకు 15మందితో సెక్యూరిటీ అవసరం ఏమొచ్చింది. ఆయనకు ప్రాణభయం ఉందా.. ప్రాణాలకు హాని ఉందా.. లేదంటే స్టేటస్ కోసం సెక్యూరిటీ తీసుకున్నాడా.. అలా స్టేటస్ చూసుకునే వాడే అయితే.. స్వామీజీ ఎలా అవుతారు.. ఇలా స్వరూపానంద చుట్టూ ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. అసలు స్వామీజీలకు ఈ స్థాయిలో సెక్యూరిటీ అవసరం లేదు అన్న చిన్న ప్రశ్నను జగన్ ఎలా మర్చిపోయారో మరి. ఎవరు అడగరు అనుకున్నారా.. అడిగే ధైర్యం చేయలేరనుకున్నారా.. అంతా తమ ఇష్టమే అని అరాచక పాలన చేశారా అనే చర్చ కూడా స్వామీజీ ఎసిపోడ్‌తో ప్రధానంగా వినిపిస్తోంది.