ఆ ముగ్గురిలో ఒకరికి RTM, వేలంలో ముంబై ప్లాన్ ఇదేనా ?
ఐపీఎల్ మెగావేలంలో 574 మంది ప్లేయర్స్ షార్ట్ లిస్ట్ అవగా... అందులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన 12 మంది భారత ఆటగాళ్ళు, 208 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. అయితే మొత్తంగా 574 మంది ప్లేయర్స్ వేలానికి వచ్చినా దానిలో 204 మంది ప్లేయర్సే ఆయా ఫ్రాంఛైజీల్లోకి వెళ్లనున్నారు.
ఐపీఎల్ మెగావేలంలో 574 మంది ప్లేయర్స్ షార్ట్ లిస్ట్ అవగా… అందులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన 12 మంది భారత ఆటగాళ్ళు, 208 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. అయితే మొత్తంగా 574 మంది ప్లేయర్స్ వేలానికి వచ్చినా దానిలో 204 మంది ప్లేయర్సే ఆయా ఫ్రాంఛైజీల్లోకి వెళ్లనున్నారు. వీళ్లలో 70 మంది విదేశీ ప్లేయర్సే వేలంలో అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది. ఇక ఈ జాబితాలో 318 మంది అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఇండియన్ ప్లేయర్స్ ఉండగా.. 12 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. అసోసియేట్ దేశాలకు చెందిన ముగ్గురు ప్లేయర్స్ ను కూడా షార్ట్ లిస్ట్ చేశారు. ఈ వేలంలో 2 కోట్ల బేస్ ప్రైస్ తో 81 మంది ప్లేయర్స్ ఉన్నారు. అలాగే కోటిన్నర బేస్ ప్రైస్ తో 27 మంది, 1.25 కోట్లలో 18 మంది, కోటి బేస్ ప్రైస్ లో 23 మంది ప్లేయర్స్ ఉన్నారు. 425 మంది ప్లేయర్స్ కోటి బేస్ ప్రైస్ కంటే కింద ఉంటారు.
కాగా కొన్ని ఫ్రాంచైజీలు రిటెన్షన్ లో ఎక్కువ మొత్తం ఖర్చు పెడితే.. మరికొన్ని వేలం కోసం ఎక్కువ మొత్తాన్ని తమ దగ్గర ఉంచుకున్నాయి. ఇప్పుజు ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా ఎవరిని దక్కించుకోవాలి, భారీ మొత్తాన్ని ఎవరి కోసం వెచ్చించాలన్న దానిపై కసరత్తు చేస్తున్నాయి. దీనిలో భాగంగా ముంబై ఇండియన్స్ ఆక్షన్ స్ట్రాటజీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముంబై ఐదుగురు ప్లేయర్స్ ను రిటైన్ చేసుకుంది. జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ, తిలక్ వర్మలను అట్టిపెట్టుకుంది. వీరి కోసం ఆ ఫ్రాంచైజీ 75 కోట్లు ఖర్చుపెట్టింది. తమ మనీ పర్స్ లో మిగిలిన 45 కోట్లతో వేలం బరిలోకి దిగుతోంది. నిబంధనలకు అనుగుణంగా ముంబై ఇండియన్స్ గరిష్టంగా 20 మందిని కొనుగోలు చేసుకోవాల్సి ఉంది. అందులో 8 మంది విదేశీ ప్లేయర్లు ఉండాలి. తమ మాజీ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా సొంతం చేసుకునే అవకాశం ఉంది.
అయితే మెగా వేలంలో ఆర్‌టీఎమ్ కార్డు ఉపయోగించి నెహాల్ వదేరా, ఆకాశ్ మద్వాల్, నమన్ ధిర్, పీయూష్ చావ్లాలలో ఒకరిని దక్కించుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. వేలంలో నెహాల్ వదేరాకు భారీ డిమాండ్ దక్కే అవకాశం ఉంది. 24 ఏళ్ల నెహాల్ ఫినిషర్‌గానే కాకుండా బంతితో కూడా రాణించగలడు. ఇక ఆకాశ్ మద్వాల్, నమన్ ధిర్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ఆకాశ్ గత సీజన్‌లో నిరాశపరిచిన 2023లో సత్తాచాటాడు. నమన్ ధిర్ గత అరంగేట్రం సీజన్‌లోనే తన ధనాధన్ బ్యాటింగ్‌తో ఫ్యూచర్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. వీళ్లతో పాటు సీనియర్ స్పిన్నర్ పీయూష్ చావ్లాను ఆర్‌టీఎమ్‌తో సొంతం చేసుకునే ప్లాన్‌లోనూ ముంబై ఇండియన్స్ ఉంది. 2012లో చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన చావ్లా తాజా నిబంధనలతో అన్‌క్యాప్డ్ ప్లేయర్ గా నిలిచాడు.